హైదరాబాద్ MMTS ఘటనపై కేటీఆర్ సంచలన ట్వీట్

హైదరాబాద్ ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటనపై బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఈ ఘటన తనను షాక్ కు గురిచేసిందన్నారు. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఎమోషనల్ అయ్యారు. ఈ మేరక్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

KTR Tweets Shock Over Attempted Rape of Young Woman on Hyderabad MMTS Train

" హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం కలకలం రేపుతోంది.. తప్పించుకునే క్రమంలో యువతి రైలు నుంచి కిందకు దూకింది. ఈ ఘటన నాకు షాక్ కు గురిచేసింది. ఈ వార్త వినడానికి అసౌకర్యంగా ఉంది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు వీలైనంత త్వరగా విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని నేను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరుతున్నా. తెలంగాణ పోలీస్, రాష్ట్ర మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు బాధితురాలికి అండగా ఉండాలి. ఇది రైల్వేస్ కు సంబంధించిన విషయం అయినప్పటికీ రేవంత్ సర్కార్ ఇకనైనా మేల్కోవాలి. ఇది వేకప్ కాల్ గా భావించాలి" అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటేనే శాంతి భద్రతల పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.

ఏం జరిగిందంటే..?

సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే MMTS రైలులో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడే యత్నం చేశాడు ఓ యువకుడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో ఆ యువతి రైలు నుంచి బయటకు దూకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+