కేటీఆర్ యూఎస్ టూర్: తెలంగాణలో మరో రెండు సంస్థల భారీ పెట్టుబడులు

వాషింగ్టన్: అమెరికాలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వరుసకడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. తాజాగా, మరో రెండు సంస్థలు కూడా ముందకు వచ్చాయి. హైదరాబాద్‌లో డెలివరీ సెంటర్ విస్తరణను గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ప్రకటించింది.
మరోవైపు, డేటా సెంటర్ అభివృద్ధికి 50 మిలియన్ డాలర్లను ఔరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్ సంస్థ కేటాయించింది.

తెలంగాణలో డేటా టెక్ స్టార్టప్ ఔరమ్ వెంచర్ పార్ట్‌నర్ సంస్థ 5 మిలియన్ డాలర్లు ప్రకటించింది. ఇది ఇలావుండగా, తెలంగాణ ప్రభుత్వంతో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఒప్పందం కుదర్చుకుంది. తక్కువ ధరలో పర్యావరణహిత వాహనాలను అందించే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల కోసం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా జీరో ఎమిషన్ వాహనాల కోసం సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేయనున్నారు.

KTR

మరోవైపు, ఆటోమొబైల్‌ రంగానికి సంబంధించి గేర్లు ఉత్పత్తి చేసే రేవ్‌ గేర్స్‌ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తి చేసింది. మొట్టమొదటి గ్లోబల్‌ డెవలప్​మెంట్​ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన స్టోరెబుల్‌ సంస్థ హైదరాబాద్‌లో తమ సేవలను విస్తరించేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ నుంచి వంద మంది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లను హైర్‌ చేసుకుని తమ సేవలను విస్తరించనుంది.

కాగా, హైదరాబాద్‌లో 10 వేల మందితో ఉపాధి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వీఎక్స్ఐ సొల్యూషన్స్(VXI Global Solutions) ఇటీవలే ప్రకటించింది.
ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో VXI Global Solutions గ్లోబల్ చీఫ్ హెచ్ఆర్ ఎరికా బోగర్ కింగ్ సమావేశమై.. సంస్థ నిర్ణయాన్ని వెల్లడించారు. 1998లో నెలకొల్పిన ఈ సంస్థకు ప్రస్తుతం ఉత్తర అమెరికా, ఆసియా, ఐరోపా, కరేబియన్ దేశాల్లోని 42 కేంద్రాల్లో 40 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో 10 వేల మందితో కొత్త కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. నగరానికి మరో ఐటీ సంస్థ రావడంతో మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. మరోవైపు, హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు.. ప్రముఖ పర్యాటక సంస్థ మాండీ ముందుకొచ్చింది. ఆ కేంద్రంతో 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని కేటీఆర్‌తో సమావేశం తర్వాత.. మాండీ ఛైర్మన్‌ ప్రసాద్‌ గుండుమోగుల తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+