మీరు సిద్ధమా?: నాగ్, మహేష్ బాబు, సానియా, మంచు లక్ష్మీ, సమంతలకు కేటీఆర్, కమల్ స్పందన
తాను చేనేత వస్త్రాలు ధరిస్తున్నానని, మరి మీ మాటేమిటని.. ప్రముఖులను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ఆహ్వానం పలికారు.
హైదరాబాద్: తాను చేనేత వస్త్రాలు ధరిస్తున్నానని, మరి మీ మాటేమిటని.. ప్రముఖులను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆహ్వానం పలికారు.
Me in Handloom in support of weavers. What about you @ikamalhaasan @urstrulyMahesh @MirzaSania @sardesairajdeep @vivek_oberoi#WearHandloom pic.twitter.com/gyRa9IDJ74
— KTR (@KTRTRS) January 3, 2017
ప్రతి సోమవారం నాడు చేనేత దుస్తుల్లోనే తాను విధులకు హాజరవుతానని మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. చెప్పిన మాట మీద ఆయన నిలబడ్డారు. అందులో భాగంగా నిన్న (సోమవారం) చేనేత దుస్తులు ధరించి కార్యాలయానికి వచ్చారు.
Me in Handlooms in support of weavers. What about you? @iamnagarjuna @RanaDaggubati @LakshmiManchu @Pvsindhu1 @Samanthaprabhu2#WearHandloom pic.twitter.com/gLhxjrgjRh
— KTR (@KTRTRS) January 3, 2017
కేటీఆర్‌తో పాటు ఆయన కార్యాలయ సిబ్బంది, అధికారులు కూడా చేనేత దుస్తుల్లో వచ్చారు. చేనేతకు చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, మంగళవారం నాడు ప్రముఖులకు చేనేత దుస్తులు ధరించాలని ఆహ్వానం పలికారు.
👍 good luck with Australian https://t.co/vk3PDQL9aU
— KTR (@KTRTRS) January 3, 2017
విలక్షన నటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ మహేష్ బాబు, టెన్నిస్ తార సానియా మీర్జా, రాజ్‌దీప్ సర్దేశాయ్, వివేక్ ఒబెరాయ్, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, పీవీ సింధు, నటి సమంత తదితరులను ఆహ్వానించారు.
I also support handloom weavers. Have grown seeing my father wear nothing but handloom clothes, through his life@KTRTRS
— Kamal Haasan (@ikamalhaasan) January 3, 2017
కమల్ హాసన్ స్పందన
కేటీఆర్ ట్వీట్‌కు కమల్ హాసన్ స్పందించారు. చేనేతకు అండగా నేను సైతం అన్నారు. అలాగే అందరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. తన తండ్రి జీవితకాలమంతా చేనేత వస్త్రాలే ధరించారన్నారు. చేనేతకు అండగా నిలబడదామన్నారు.












Click it and Unblock the Notifications