డార్లింగ్ "ప్రభాస్"కి కేటీఆర్ ఫోన్.. కారణం అదే ??
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మళ్లీ హాట్ టాపిక్ గా మారారు. ఆయన రాజకీయాల్లో ఎంత చురుకుగా ఉంటారో, అంతే చురుగ్గా యువతతో, సినీ ప్రముఖులతో కూడా మంచి అనుబంధాన్ని కొనసాగిస్తుంటారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. పలు సినిమా ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు కూడా ఆయన హాజరు అవుతుంటారు. ఇప్పుడు మరోసారి రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఆయన చేసిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'అండర్-18 వరల్డ్' పిల్లలతో సందడి చేసిన కేటీఆర్
తాజాగా నిర్వహించిన 'ది అండర్-18 వరల్డ్' కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఎంతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారితో సరదాగా గడిపారు. రాజకీయ నాయకుడిలా కాకుండా ఓ స్నేహితుడిలా పిల్లలతో కలిసిపోయి నవ్వులు పంచుకున్నారు. చిన్నారులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా, హాస్యంగా సమాధానాలు ఇస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.

కాగా పిల్లలు అడిగిన కొన్ని ప్రశ్నలు కేటీఆర్‌ను కూడా నవ్వుల్లో ముంచెత్తాయి. మరికొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పలేక సరదాగా తల పట్టుకోవడం అక్కడున్న వారిని కడుపుబ్బా నవ్వించింది. ఈ మొత్తం సంభాషణలో ఆయన చూపించిన హాస్యచతురత ప్రేక్షకులను ఆకట్టుకుంది.
లైవ్‌లోనే ప్రభాస్‌కు ఫోన్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్
ఈ కార్యక్రమంలో హైలైట్‌గా నిలిచిన ఘట్టం రెబల్ స్టార్ ప్రభాస్‌కు కేటీఆర్ చేసిన ఫోన్ కాల్. పిల్లల కోరిక మేరకు కేటీఆర్ స్టేజ్‌పైనే ప్రభాస్‌కు కాల్ చేశారు. కాల్ లిఫ్ట్ చేసిన ప్రభాస్‌తో కొద్దిసేపు సరదాగా మాట్లాడారు. ప్రభాస్‌తో కేటీఆర్ సంభాషణను ప్రత్యక్షంగా చూసిన చిన్నారులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ అభిమానులు కూడా ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ఇద్దరి మధ్య ఉన్న స్నేహంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
పుష్-అప్స్..
కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాకుండా, కేటీఆర్ తన స్పోర్టివ్ స్పిరిట్‌ను కూడా ప్రదర్శించారు. ఓ చిన్నారి ఛాలెంజ్ చేయడంతో స్టేజ్‌పైనే అతడితో కలిసి పుష్-అప్స్ చేశారు. చిన్నారితో పోటీ పడుతూ పుష్-అప్స్ తీసిన కేటీఆర్‌ను చూసి అక్కడున్న వారంతా చప్పట్లతో అభినందించారు. ఈ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇకస్ కార్యక్రమం మధ్యలో కేటీఆర్ మొబైల్‌కు ఆయన భార్య నుంచి కాల్ వచ్చింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన కేటీఆర్.. "నేను ఇప్పుడు అండర్-18 వరల్డ్ పిల్లలతో కార్యక్రమంలో ఉన్నాను.. కొద్దిసేపట్లో మళ్లీ కాల్ చేస్తాను" అని చెప్పి ఫోన్ పెట్టేశారు.
ప్రభాస్‌కు ఫోన్ చేసిన KTR 🥰#Prabhas #KTR pic.twitter.com/2V1aSmPbhF
— Milagro Movies (@MilagroMovies) July 1, 2026
మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. 'కల్కి 2898 AD పార్ట్-2' షూటింగ్‌కు సిద్ధమవుతుండగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' చిత్రంలో కూడా నటిస్తున్నారు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త పీరియాడిక్ లవ్ స్టోరీలోనూ ప్రభాస్ నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్టులు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, కేటీఆర్ చేసిన ఫోన్ కాల్‌కు స్పందించడం అభిమానులను మరింత ఆనందానికి గురిచేసింది.












Click it and Unblock the Notifications