కవిత సంచలన ట్వీట్.. కేటీఆర్ స్ట్రాంగ్ రిప్లై..?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు. కర్మ హిట్స్ బ్యాక్(కర్మ ఎవరినీ వదిలిపెట్టదు) అంటూ సంచలన పోస్టు పెట్టారు. ఆ తర్వాత దండం పెడుతున్నట్లుగా ఉన్న ఈమోజీలను పెట్టారు. జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత ఆమె ఈ పోస్టు చేయడంతో సంచలనంగా మారింది. తనను అవమానించి పార్టీ నుంచి బయటకు పంపించినందుకే ఎన్నికల ఫలితాల తర్వాత కవిత ఈ పోస్టు పెట్టారని సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. 24,729 ఓట్ల మెజార్టీతో విజయదుందుభి మోగించారు. ఆయనకు మొత్తం 98,988 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74, 259 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి.
Karma hits back !!! 🙏🙏🙏🙏
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 14, 2025
అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. "మన పార్టీ స్ఫూర్తి కింద పడటంలో లేదు. కానీ పడ్డ ప్రతిసారీ లేచి నిలబడడంలో ఉంది. మన రాష్ట్రాన్ని గెలుచుకునేందుకు ఈ సారి గట్టిగా పోరాడతాం.. ఈ రోజు ఉదయం నుంచి మీరు మాపై చూపిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు.." అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. తిరిగి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
Our greatest glory is not in never falling, but in rising every time we fall
— KTR (@KTRBRS) November 14, 2025
We will strive harder to win our state back
Thank you to all for your support and love since this morning 🙏
ఇక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పాత్రను ప్రజలు గమనించారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తామని ఆశించామని.. కానీ ఓడిపోయామన్నారు. ఓడిపోయామని తమకు ఎలాంటి నిరాశ లేదని స్పష్టం చేశారు. బలంగా తిరిగొస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిపై విశ్లేషించుకుంటామని, అలాగే ఈ ఫలితంపై ఆత్మ విమర్శ చేసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజా క్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలీకృతం అయ్యామని తెలిపారు. ఈ క్రమంలో గెలవాల్సింది పార్టీలు కాదని.. ప్రజలు అని కేసీఆర్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారని కేటీఆర్ గుర్తుచేశారు.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications