Himanshu: పెద్ద మనస్సు చాటుకున్న కేటీఆర్ కుమారుడు హిమాన్షు.. ఏం చేశాడంటే..?

తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు గొప్ప మనస్సు చాటుకున్నాడు. చిన్న వయస్సులోనే గ్రేటర్ హైదరాబాద్ లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్నారు. ఆ పాఠశాలను కార్పొరేట్‌ స్కూల్‌కు ధీటుగా మార్చారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాడు. హిమాన్షు సీఏఎస్ అధ్యక్షుడిగా తన పాఠశాలలో సేకరించిన నిధులతో ఈ పాఠశాలలో మౌలిక సదుపాయలు కల్పించారు.

దాదాపు రూ.కోటి రూపాయలతో పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తీర్చిదిద్దారు. జులై 12న హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిసింది. అప్పట్లో హిమాన్షు పాడిన పాట వైరల్ అయింది.ఆ పాటను తాను ఎంతో ఇష్టపడ్డానని కేటీఆర్ కూడ చెప్పారు. మీరూ లైక్ చేయాలని కోరుతూ ఆ పాట యూట్యూబ్ లింక్ ను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.

KTR

అల్లుడూ.. నువ్వు సూపర్, అదరగొట్టేశావ్ అంటూ ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించిన విషయం తెలిసిందే. హిమాన్షు గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 12వ తరగతి పూర్తి చేసి పట్టా తీసుకున్నాడు. చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన, మ్యూజిక్ లో పరిజ్ఞానం ఉన్న హిమాన్షు ఇప్పటికే అనేక సార్లు అనేక విషయాలలో వార్తల్లో నిలిచారు. పాటలతో, పెద్ద మనస్సుతో హిమాన్షు తాతాకు తగ్గ మనవడిగా.. తండ్రికి తగ్గ తనయుడిగా నిలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+