నెలకు 15లక్షల మామూళ్లు: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
మెదక్: జిల్లాలోని కొండపాక మండలం కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి(45) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీస్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో తుపాకీతో కణత వద్ద కాల్చుకున్నారు. కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఇంట్లోలేని సమయంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
కాగా, అతని మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించింది. ఓ డీఎస్పీతోపాటు సీఐ మామూళ్ల కోసం వేధించిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు. వివాహేతర సంబంధం ఆరోపణలు కూడా ఆయనను మానసికంగా కుంగదీసినట్లు తెలుస్తోంది. కాగా, రెండ్రోజుల ముందే భార్యను పుట్టింటికి పంపారు రామకృష్ణ.
ఆత్మహత్య చేసుకునే ముందు రామకృష్ణ.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు ఫోన్ చేశారు. 'నేను వెళుతున్నా’ అని చెప్పారు. కాగా, వారిద్దరు విషయాన్ని గజ్వేలు ఎస్సై కమలాకర్‌కి తెలిపారు. ఎస్సై కమలాకర్ వచ్చేలోపే రామకృష్ణ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
2009 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణ.. గతంలో సైన్యంలో కూడా పనిచేశారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రామకృష్ణ స్వస్థలం నల్గొండ జిల్లా బక్కమంత్రగూడెం.
తాను ఉద్యోగం మానేస్తానని మంగళవారం రాత్రి రామకృష్ణ తన భార్యకు ఫోన్ చేసి చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశారని ఆయన భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్నతాధికారుల వేధింపులే తన భర్త మృతికి కారణమని ఆయన భార్య ఆరోపించారు.
కాగా, రామకృష్ణ మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణ మృతదేహాన్ని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. రామకృష్ణ ఆత్మహత్యకు కారణమైన ఉన్నతాధికారులను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, విధుల్లో ఎంతో నిజాయితీగా ఉండే ఎస్ఐ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
డీఎస్పీకి నెలకు రూ. 15లక్షలు, సీఐకి మామూళ్లు
సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌కు నెలకు రూ. 15లక్షలు పంపుతున్నట్లు రామకృష్ణ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. డీఎస్పీతోపాటు సీఐ ఆంజనేయులు, పాత సీఐ వెంకటయ్యలు కూడా మామూళ్ల కోసం వేధింపులకు గురిచేసేవారని తెలిపారు.
సీఐకి 8నెలల నుంచి మామూళ్ళు పంపుతున్నట్లు చెప్పారు. మరింత ఒత్తిడి, వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ సయ్యద్, ముత్యం, కానిస్టేబుల్ యాదవ రెడ్డిలు కూడా తనను వేధింపులకు గురిచేశారని ఆయన తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.

రామకృష్ణ మృతదేహం
2009 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణ.. గతంలో సైన్యంలో కూడా పనిచేశారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రామకృష్ణ స్వస్థలం నల్గొండ జిల్లా బక్కమంత్రగూడెం.

రామకృష్ణ(ఫైల్)
తాను ఉద్యోగం మానేస్తానని మంగళవారం రాత్రి రామకృష్ణ తన భార్యకు ఫోన్ చేసి చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

సూసైడ్ నోట్
పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశారని ఆయన భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.

సూసైడ్ నోట్
ఉన్నతాధికారుల వేధింపులే తన భర్త మృతికి కారణమని ఆయన భార్య ఆరోపించారు.

సూసైడ్ నోట్
కాగా, రామకృష్ణ మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

సూసైడ్ నోట్
రామకృష్ణ మృతదేహాన్ని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. రామకృష్ణ ఆత్మహత్యకు కారణమైన ఉన్నతాధికారులను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

సూసైడ్ నోట్
విధుల్లో ఎంతో నిజాయితీగా ఉండే ఎస్ఐ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications