అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య

అమెరికాలో తెలంగాణకు చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ అన్షుల్ న్యూయార్క్‌ లో ఉన్నత చదువులు చదువుతూ, పిజ్జా డెలివరీ బాయ్‌ గా పని చేస్తున్నాడు. అయితే రాత్రి సమయంలో పిజ్జా డెలివరీ బాయ్‌ గా పనిచేస్తుండగా గుర్తు తెలియని దుండగులు అన్షుల్ పై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడిన అన్షుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దాంతో వారిని ఓదార్చేందుకు బంధువులు, సన్నిహితులు అన్షుల్ ఇంటికి చేరుకుంటున్నారు. ఇక తన అన్న అన్షుల్ కోసం సోదరి అన్వి ఏడుస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తన అన్న మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తన్వి వేడుకున్నారు. సోమవారం మృతదేహం భారత్‌కు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

KunchaAnshul from Medchal s Gundlapochampally Brutally Murdered in New York USA KunchaAnshul

ఉన్నత చదువుల కోసం ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళ్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి 50 నుంచి 60 వేల మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తుంటారు. అమెరికాకు వెళ్లే భారతీయుల్లో దాదాపు 50 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా విదేశీ ప్రయాణం అంటే విద్యార్థులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+