రాజకీయ భవిష్యత్తు పాతరేస్తాం: తలసానికి రమణ హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ భవిష్యత్తుకు పాతరేస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ శుక్రవారం హెచ్చరించారు. సనత్ నగర్ నియోజకవర్గ టిడిపి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
కార్యకర్తలను, పార్టీని, ప్రజలను తలసాని తీవ్రంగా మోసం చేశారన్నారు. ఓటమి భయంతోనే గ్రేటర్ హైదరాబాదులో ప్రభుత్వం ఓట్లను తొలగించిందని మండిపడ్డారు.
తొలగించిన ఓట్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు అందిస్తామన్నారు. సనత్ నగర్లో టిడిపి భారీ మెజార్టీతో గెలుస్తుంద్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ టిఆర్ఎస్ ప్రతినిథిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం: మధు
టీఆర్‌ఎస్ ప్రభుత్వ పని తీరును చూసి ఇతర పార్టీల కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. కరీంనగర్ జిల్లాలోని మంథనిలో స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు సమక్షంలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధు మాట్లాడారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications