Meddigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ పాపం ఎవరిది.. ప్రజలపై వందల కోట్ల భారం..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాకంగా నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు నిర్మించింది. అయితే మేడిగడ్డ నిర్మించిన మూడేళ్లకే కుంగిపోవడం కలకలం సృష్టించింది. లక్షల కోట్లు ఖర్చు చేసిన కట్టిన ప్రాజెక్టు మూన్నళ్ల ముచ్చటగా మారిందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై భారీగా విమర్శలు వచ్చాయి. అప్పటి వరకు ఉ అంటే కాళేశ్వరం అ అంటే కాళేశ్వరం పేరు ఎత్తే బీఆర్ఎస్ నేతలు ప్రచారంలో ప్రాజెక్టు పేరునే ఎత్తలేదు.

ప్రాజెక్టు కుంగిన తర్వాత దాని బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదేనని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చెల్లింపులు లేకుండానే మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేస్తారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది వట్టి మాటేనని అర్థమైంది. రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని ఎల్అండ్ టీ కుండబద్దలు స్పష్టం చేసింది.చేపట్టాల్సిన రిపేర్లకు డబ్బులు ఇవ్వాల్సిందేనని కుండబద్దలు కొట్టింది. ఇప్పటికే కాళేశ్వరం తెలంగాణకు గుదిబండలా మారింది.

 L&T to not bear the cost of Medigadda barrage repair

ఈ ప్రాజెక్టు కరెంటు బిల్లుల రూపంలో సంవత్సరానికి వందల కోట్లు చెల్లించాలి. ఇప్పుడు రిపేర్ ఖర్చులు కూడా చెల్లించాలంటే.. ప్రాజెక్ట్ ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ అని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. డిఫెక్ట్​ లయబిలిటీ పీరియడ్​ఐదేండ్లు కాదని రెండేండ్లేనని ఎల్ అండ్ టీ పేర్కొంది. ఆ గడువు కూడా ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసిందనే స్పష్టం చేసింది. బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేయడానికి ఖర్చయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని లేఖ రాసింది.

ఈ ఏడాది అక్టోబర్​21న మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్​లోని పిల్లర్లు కుంగాయి. దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చని మొదట ప్రాజెక్టు ఇంజినీర్లు పోలీసుల ఫిర్యాదు చేశారు. సాంకేతిక కారణాలతోనే బ్యారేజీ కుంగినట్టుగా తర్వాత స్పష్టమైంది. నేషనల్ ​డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్​ఆధ్వర్యంలోని ఎక్స్​పర్ట్ ​టీమ్ బ్యారేజీని పరిశీలించి డిజైన్ల లోపం, నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టకపోవడంతోనే కుంగినట్టుగా ప్రాథమికంగా నివేదిక ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+