ఆ లేడీ కండక్టర్ భలే మంచిది: ప్రాణం కాపాడింది
హైదరాబాద్: గుండెపోటుకు గురైన ప్రయాణికుడిని సకాలంలో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన మహిళా కండక్టర్ నీలిమను తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గురువారం అభినందించారు. ఆమెకు నగదు పురస్కారం అందించారు.
హైదరాబాదులోని ముషీరాబాద్-1 డిపోలో నీలిమ కండక్టర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల 1జె రూట్ బస్సులో ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. అదే బస్సులో విధి నిర్వహణలో ఉన్న నీలిమ ఆ ప్రయాణికుడిని వెంటనే హాస్పిటల్‌కు తీసకెళ్లి సత్వరమే చికిత్స అందేలా చూశారు.

దాంతో అతడి ప్రాణం నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ గురువారం ఆమెను బస్‌భవన్‌లోని తన చాంబర్‌కు పిలిపించి అధికారుల సమక్షంలో నగదు పురస్కారం అందజేసి ప్రశంసించారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎం రవీందర్, నాగరాజు, పురుషోత్తం నాయక్, సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications