• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మామాతో కోడలి వివాహేతర సంబంధం: 40 రోజుల ఎంజాయ్ తర్వాత ఇలా..

By Narsimha
|

ఖమ్మం: కట్టుకున్న భర్తను కాదని, మామాతో వివాహేతర సంబంధం పెట్టుకొంది ఓ యువతి. విషయం తెలిసి భర్త మందలించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా మామాతో కలిసి పారిపోయింది. 40 రోజుల పాటు మామాతో కలిసి ఇతర ప్రాంతాల్లో గడిపింది. అయితే చివరకు వారిద్దరూ ఆత్మహత్యకు ప్రయత్నించారు. మామా చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోండగా, కోడలు మాత్రం చనిపోయింది.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకొంది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన అనితకు నాలుగేళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన బానోత్ వీరన్న కుమారుడు శ్రీకాంత్ కు ఇచ్చి పెళ్ళి చేశారు.

 A lady died for Illegal affair in khamma district

కాపురం సజావుగా సాగుతున్న సమయంలోనే వీరన్న తన కోడలిపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకొన్నాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. భర్త అనితను మందలించాడు.అయినా ఆమెలో మార్పు రాలేదు.

దీంతో వీరన్న కోదాడకు పారిపోయాడు. అనిత పుట్టింటికి వెళ్ళింది. కోడలు రాకపోవడంతో వీరన్న ఆమెతో మాట్లాడాడు. ఎటైనా వెళ్లి బతకాలని నిర్ణయించుకొన్నారు. ఆమె కూడ అంగీకరించింది.

రూ. లక్ష నగదు, మరో లక్ష రూపాయాల ఏటీఎం ను తీసుకొని పారిపోయారు. మే 19వ, తేదిన అనిత కన్పించడం లేదని డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

అనుమానంతో వీరన్న బ్యాంకు లావాదేవీలను కుటుంబసభ్యులు నిలిపివేయించారు. ఉన్న డబ్బుతోనే 40 రోజులపాటు వీరిద్దరూ గడిపాడు. డబ్బులు అయిపోవడంతో శుక్రవారం నాడు ఇంటిముఖం పట్టారు.

అయితే వారిద్దరిని ఇంట్లోని రానివ్వలేదు కుటుంబసభ్యులు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. తమ వద్ద ఉన్న సెల్ ఫోన్ ను ఓ దుకాణంలో పెట్టి రూ.2500 తీసుకొన్నారు. పురుగుల మందు, ఎలుకల మందు, మద్యం, బ్లేడ్ లను కొన్నారు. మంచుకొండ దగ్గరకు వెళ్ళి అక్కడ మద్యం ఎలుకల మందు తాగి బస్టాండ్ కు చేరుకొన్నారు. అక్కడ బ్లేడ్ లతో మణికట్టు కోసుకొన్నారు.

రక్తపు మడుగులో ఉన్న వారిని స్థానికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులకు సమాచారమిచ్చారు. చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది. వీరన్న ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A lady suicide for illegal affair in Khammam district. Anita married srikanth four years back. she continue extramarital affair with srikanth father veeranna. they were suicide attempt two days back, Anita died, Veeranna under treatment in hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more