పార్కు చేసిన కారు దూసుకొచ్చింది: సాఫ్ట్‌వేర్ సంస్థ ఉద్యోగిని ప్రాణాలు తీసింది (ఫొటోలు)

హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని మృత్యువు వెంటాడి కబళించింది. పార్కింగ్ చేసిన కారు దూసుకొచ్చి ఆమె ప్రాణాలు తీసింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లా శ్రీశైలం దగ్గర సున్నపెంట గ్రామానికి చెందిన దేవడే అంబిక(25) ఎంబీఏ పూర్తిచేసి కమలాపురి కాలనీలోని సిసిర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థలో గత నెల 23న హెచ్‌ఆర్ మేనేజర్‌గా చేరింది. తండ్రి శ్రీశైలంలో బీఎస్‌ఎన్‌లో ఉద్యోగి. మధురానగర్‌లోని ఓ లేడీస్ హాస్టల్‌లో ఉంటున్న అంబిక రోజులాగానే ఆఫీసుకు నడుచుకుంటూ వస్తోంది.

Lady dies in a accident when a car hits her due to Hands Breaks Failure

అదే సమయంలో గణపతి కాంప్లెక్స్ సమీపంలో రోడ్డుపై నిలిపిన కారుకు హ్యాండ్‌బ్రేక్ వేసిన డ్రైవర్ ప్రవీణ్ దిగి పక్కనున్న కార్‌షోరూంలోకి వెళ్లాడు. హ్యాండ్ బ్రేక్ సరిగా పడకపోవడంతో మెల్లగా రోడ్డుపైకి వచ్చిన కారు దిగువకు వేగంగా వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అంబికను ఢీకొట్టింది.

Lady dies in a accident when a car hits her due to Hands Breaks Failure

దీంతో ఎగిరి రోడ్డుపై పడడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అంబికను సమీపంలోని నిఖిల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ తదితరులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై ఐపీసీ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+