పెళ్లికి ఒప్పుకోలేదని లేడీ టెక్కీని గోడకేసి బాదిన మరో టెక్కీ: తీవ్రగాయాలు
ప్రేమిస్తున్నానని, తననే పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. తోటి మహిళ టెక్కీపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన నగరంలోని ఘట్‌కేసర్‌లో చోటు చేసుకుంది. ఘటనపై
హైదరాబాద్: ప్రేమిస్తున్నానని, తననే పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. తోటి మహిళ టెక్కీపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన నగరంలోని ఘట్‌కేసర్‌లో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ బి ప్రకాష్ కథనం ప్రకారం.. పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇన్ఫోసిస్‌లో పిట్ట రోజా (23) రెండున్నర ఏళ్లగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది.
సింగాపూర్ టౌన్‌షిప్‌లో ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటోంది. అదే సంస్థలో ఏడాదిన్నరగా పని చేస్తున్న చరణ్‌చౌదరి రోజా ఉంటున్న ఫ్లాట్ పక్కనే నివాసం ఉంటున్నాడు.

ఆరు నెలలుగా ప్రేమించమని ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. బుధవారం రాత్రి రోజా ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లిన చరణ్.. తనను పెళ్ళి చేసుకోవాలని అడిగాడు. అందుకు రోజా అంగీకరించక పోవడంతో ఆగ్రహానికి గురైన చరణ్.. ఆమెపై దాడి చేశాడు.
అమె తలను గోడకేసి బాదాడు.
దీంతో ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో చరణ్ చౌదరి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications