లేడీ టెక్కీ: రాత్రి గది తలుపులేసుకుంది, తెల్లారి శవమై తేలింది

హైదరాబాద్: ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. జెపి మోర్గాన్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న శ్వేత అనే మహిళ బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. శ్వేత 2006లో సికింద్రాబాదులోని రాంగోపాల్ పేట నల్లగుట్టకు చెందిన ఫొటోగ్రాఫర్ వై. శ్రీకాంతాచారిని పెళ్లి చేసుకుంది.

వారికి శ్రీలక్ష్మి (8), విన్నీ (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ ఫోటో స్టూడియోతో పాటు కేబుల్ టీవీ నిర్వహిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవని అంటారు. శనివారం ఉదయం శ్వేత పద్మారావునగర్‌లోని స్కంధగిరి దేవాలయంంలో కల్యాణం చేయిచుకునేందుకు టికెట్ బుక్ చేసుకుని రావాలని భర్తకు చెప్పింది.

రాత్రి ఇంటికి వచ్చిన శ్రీకాంత్ టికెట్ తీసుకోలేదని చెప్పడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో శ్వేత మొదటి అంతస్తులోని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటానని శ్వేత తరుచుగా అంటూ ఉండేదని చెబుతున్నారు. దీంతో శ్రీకాంత్ పట్టించుకోలేదు.

Lady techie shwetha commits suicide in hyderabad

మర్నాడు ఉదయం 8 గంటలకు శ్రీకాంత్ తలుపు తట్టినా తీయలేదు. దీంతో వెంటనే తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లాడు. అప్పటికే ఆమె చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయిం ఉంది.

కాగా, తన కూతురుని భర్త శ్రీకాంత్, ఆయన కుటుంబ సభ్యులే చంపేశారని శ్వేత తండ్రి శ్రీనివాసాచారి ఆరోపించాడు. శ్రీకాంత్ తాగి వచ్చి ఆమెను కొట్టేవాడని, వివాహేతర సంబంధాలు పెట్టుకుని వేధించేవాడని ఆరోపించారు. నిరుడు జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున పోటీచేయాలని కోరగా ఆమె ఇష్టపడలేదని చెప్పారు

అప్పటి నుంచి వేధింపులు పెరిగాయని చెప్పారు. భరత్ శ్రీకాంత్, అత్తామామలు రేవతి, గణేష్‌లపై, మరిది అరుణ్‌లపై శ్వేత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+