చేప ప్రసాదానికి భారీస్పందన, బత్తిని ఇంట్లో ప్రసాదం పంపిణీ కొనసాగింపు
Recommended Video

హైదరాబాద్: మృగశిరకార్తెను పురస్కరించుకుని బత్తిన హరినాథ్ గౌడ్ నేతృత్వంలో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీనిని ప్రారంభించారు. ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ఉచిత చేప ప్రసాదం పంపిణీ చేస్తారు.
శనివారం ఉదయం ఇది ముగిసింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిన్న ఉదయం చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించామని, ఈ రోజుతో ముగించామన్నారు. 75,361 మందికి చేప ప్రసాదం స్వీకరించారని, దూద్‌బౌలిలోని బత్తిని హరినాథ్ గౌడ్ ఇంటి వద్ద ఈ ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని తెలిపారు.

ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా అస్తమా వ్యాధిగ్రస్తులు చేప మందు ప్రసాదం స్వీకరించేందుకు వచ్చారని చెప్పారు. ఇదిలా ఉండగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు, సిబ్బంది, వాలంటీర్లకు మంత్రి తలసాని కృతఙ్ఞతలు తెలిపారు.
రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, జీహెచ్‌ఎంసీ, సమాచార, పౌర సంబంధాల శాఖ, జలమండలి, అర్‌అండ్ బీ, విద్యుత్తు, ఆర్టీసీ, వైద్యారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఎగ్జిబిషన మైదానంలో టెంట్లు ఏర్పాటు చేసి, 3 లక్షల వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సేవా సంస్థలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications