• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం కేసిఆర్ కు సోషల్ తలనోప్పి, పెరుగుతున్న రైతు ఫిర్యాదులు

|

భూరికార్డుల విషయంలో తేనేతుట్టే కదిలింది, అంతా సంక్రమంగా చేశామని చెబుతున్న అధికారుల తీరు షోషల్ మిడియాలో వస్తున్న ఫిర్యాదులతో బయటపడుతున్నాయి.తాజాగా ముఖ్యమంత్రి కేసిఆర్ జోక్యంతో మంచీర్యాల జిల్లాకు చెందిన రైతు శరత్‌కు చెందిన భూవివాదం ఓక్కరోజునలో పరిష్కారం కావడంతో సోషల్ మీడియాలో ఇలాంటీ సమస్యలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి, దీంతో అధికారుల అసలు రంగు బయడుతోంది.

సీఎం నిర్ణయాలు, కాగితాల్లో లెక్కలు

సీఎం నిర్ణయాలు, కాగితాల్లో లెక్కలు

తానోకటి తలిస్తే అధికారులు ఒకటి తలుస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రైతు పట్టా పాసుబుక్ ల ప్రక్షాళన లో సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి.ఓవైపు పట్టా పాస్ బుక్ లకు సంబంధించి 90 శాతం మేర అంతా సవ్యంగా జరిగిందని, మిగతా 10 శాతం కోర్టు వివాదాల కారణంగా పెండింగ్ లో ఉన్నాయని అందుకే వారికి రైతు బంధు సహయం అందించలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.ఇక దీనికి సంబంధించి రైతు పట్టాపాస్ బుక్ లను ఆన్ లైన్ పెట్టేందుకు ధరణి వెబ్ సైట్ ను సైతం ప్రత్యేకంగా రూపోందించారు. మరోవైపు వీరికి ఎలాంటీ పాస్ బుక్ చూపించకుండా ఆన్ లైన్ ద్వార రుణాలు ఇచ్చే ఏర్పాటును సైతం సిఎమ్ కేసిఆర్ చేస్తున్నారు.దీంతోపాటు భూముల కొనుగోళ్లు అమ్మకాలు ఎక్కడ జరిగినా వెంటనే ఆయా యాజమాన్యాల నుండి తగ్గించే విధంగా సాఫ్ట్ వేర్ ను సైతం రూపోందించారు.

పట్టించుకోని క్రిందిస్థాయి అధికారులు

పట్టించుకోని క్రిందిస్థాయి అధికారులు

సీఎం స్థాయిలో ఇంత చేస్తున్నా.. క్రింది స్థాయిలో మాత్రం విఆర్ఓ నుండి కలెక్టర్ వరకు రైతుల సమస్యలను పట్టించుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు. స్థానికంగా రైతుల సమస్యలు దృష్టికి వచ్చినా, వాటిని పట్టించుకోవడంలేదు. దీంతో రైతులు నేరుగా సీఎం కేసిఆర్ కు ఫిర్యాదు లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా సీఎం కేసిఆర్ మంచిర్యాలకు చెందిన శరత్ అనే రైతు సోషల్ మీడియా ద్వార చేసిన ఫిర్యాదుతో స్పందించి, రైతుతో నేరుగా మాట్లాడారు ,వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించడంతో ,హుటాహుటిన అధికారులు శరత్ గ్రామానికి వెళ్లి సమస్యను పరిష్కరించారు.

ఒకే నెలలో రెండుసార్లు ప్రసవం, ముగ్గురు పిల్లల జననం

సోషల్ మిడియాలో మరిన్ని సమస్యలు

సోషల్ మిడియాలో మరిన్ని సమస్యలు

ముఖ్యమంత్రి కేసిఆర్ జోక్యంతో మంచీర్యాల జిల్లాకు చెందిన రైతు శరత్‌కు చెందిన భూవివాదం ఓక్కరోజునలో పరిష్కారం కావడంతో సోషల్ మీడియాలో ఇలాంటీ సమస్యలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి, సోషల్ మిడియాలో భూ సమస్యలతోపాటు రెవెన్యూ అధికారులు,సిబ్బంది అక్రమాలను బయటపెడుతున్నారు.

తాజాగా తమ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన వెంకటాచారి తెలుపగా, సిఎమ్ కేసిఆర్ స్పందించి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. దీంతో కలెక్టర్ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించారు .కాగా సంగారెడ్డి జిల్లా కుంగ్టిలో ఓ రైతు తమ భూమి పట్టా మార్చారంటూ సెల్ టవర్ ఎక్కాడు, ఇక ట్విట్టర్ లో డీ ,సంతోష్ కుమార్ అనే రైతు 4 .22 ఎకరాల భూమిని గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని , అయితే ఇతరుల పేరుమీద రిజీస్టర్ అయిందని తెలిపారు, కాగా ఎమ్మార్వో,ఆర్డీవో కార్యాలయాల చుట్టు సంవత్సరాలుగా తిరుగుతున్నామని తెలిపారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను ఉద్దేశిస్తూ ట్విట్టర్ లో పలువురు పోస్టులు పెడుతున్నారు.ఎక్కువ మొత్తం లో భూవివాదాలకు సంబంధించిన ఫిర్యాధులు వస్తుండడంతో వాటిపై సిఎమ్ కేసిఆర్ స్పందిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Land issues in social media ,many of those seeking help, did so via messages posted on social media platforms such as Twitter.the government for help in solving problems faced by them related to land ownership, pattadar passbooks and other similar issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more