వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న మద్యం ధరలు.. నేడు భూముల రిజిస్ట్రేషన్ ధరలకు రెక్కలు .. షాక్ ఇస్తున్న తెలంగాణా సర్కార్

|
Google Oneindia TeluguNews

తెలంగాణా సీఎం కేసీఆర్ ఆర్ధిక మాంద్యం నుండి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నారా ? భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచటానికి రెడీ అవుతున్నారా ? అంతే అవును అనే సమాధానమే వస్తుంది. ఆర్ధిక ఒడిదుడుకులతో కుదేలవుతున్న రాష్ట్రాల్లో పరిస్థితులు మార్చటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతాజాగా నిర్వహించిన 38వ జీఎస్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచాలని నిర్ణయించారు .

సీఎం జగన్ ను ఫాలో అయిన సీఎం కేసీఆర్: పెంచేశారుగా లిక్కర్ ధరలుసీఎం జగన్ ను ఫాలో అయిన సీఎం కేసీఆర్: పెంచేశారుగా లిక్కర్ ధరలు

రిజిస్ట్రేషన్ ధరలు పెంచటానికి తెలంగాణా సర్కార్ కసరత్తు

రిజిస్ట్రేషన్ ధరలు పెంచటానికి తెలంగాణా సర్కార్ కసరత్తు

దీంతో తెలంగాణా రాష్ట్రంలో తెలంగాణ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది . కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారం రోజుల్లోనే భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే అవకాశం ఉంది.

ఆర్థికమాంద్యం ప్రభావంతో పన్నుల రాబడి భారీగా తగ్గి, తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. ఇప్పటికే మౌఖికంగా వివిధ అభివృద్ధి పనులను ఎక్కడివక్కడే నిలిపివేయాలని చెప్పిన తెలంగాణ సర్కార్, ఇప్పుడు తాజాగా తెలంగాణ ఖజానాకు ఆదాయం సమకూరే మార్గాలపై దృష్టిసారించింది.

మొన్న మద్యం ధరల పెంపు ... త్వరలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంపు

మొన్న మద్యం ధరల పెంపు ... త్వరలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంపు

నూతన సంవత్సరం వస్తున్న వేళ మద్యం ధరలను పెంచి ఎక్సైజ్ ఆదాయం పెంచాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ అమలు కూడా మొదలు పెట్టింది. ఇక తాజాగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచేందుకు రెడీ అయ్యారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల ధరలు భారీగా పెరగాయి. పల్లెలు , పట్టణాలు అనే తేడా లేకుండా ఐదారు రెట్లుభూముల ధరలకు రెక్కలొచ్చాయి . హైదరాబాద్ లో అయితే చుక్కలనంటున్నాయి.కానీ దానికి సరిపడా రిజిస్ట్రేషన్ విలువలు మాత్రం లేదు.

 భూములు కొనుగోలు దారులకు షాక్ ఇవ్వనున్న తెలంగాణా సర్కార్

భూములు కొనుగోలు దారులకు షాక్ ఇవ్వనున్న తెలంగాణా సర్కార్

తెలంగాణ సర్కారుకు ఆదాయం పెద్దగా సమకూరటం లేదని భావిస్తున్న నేపధ్యంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచాలని సర్కార్ భావిస్తుంది. దాదాపు 7 ఏళ్ల క్రితం నాటిరిజిస్ట్రేషన్ ధరలతో ఇప్పుడు భూముల పెరిగిన ధరలకు కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లింపులు చేస్తుంటే ప్రభుత్వానికి భారీగా గండిపడుతుంది. అందుకే భూ రిజిస్ట్రేషన్ విలువలను పెంచేందుకు కేసీఆర్ సర్కారు సన్నద్ధం అయ్యింది. మొన్న మందుబాబులకు ధరలు పెంచి షాక్ ఇచ్చిన తెలంగాణా సర్కార్ ఇప్పుడు భూ కొనుగోలు దారులకు రిజిస్ట్రేషన్ ధరలు పెంచి షాక్ ఇవ్వబోతుంది .

English summary
The Department of Telangana Stamps Registration is already conducting work to increase the registration fees . Land registration values ​​are likely to increase within a week if KCR gives the green signal.Under the impact of the recession, the tax revenue will be drastically reduced and the state treasury will be empty. Telangana government, which has already orally discontinued various development projects, is now looking at ways to provide revenue to the latest Telangana treasury
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X