హుస్సేన్‌సాగర్‌లో మరో అద్భుతం: అతిపెద్ద మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో
హైదరాబాద్: నగరం ఫార్ములా ఈ రేస్‌కు సిద్ధమవుతున్న వేళ.. హుస్సేన్ సాగర్‌లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. నగర పర్యాటకంలో మరో అదనపు ఆకర్షణగా మ్యూజికల్ ఫౌంటెయిన్ నిలుస్తోంది.
హైదరాబాద్: నగరం ఫార్ములా ఈ రేస్‌కు సిద్ధమవుతున్న వేళ.. హుస్సేన్ సాగర్‌లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. నగర పర్యాటకంలో మరో అదనపు ఆకర్షణగా మ్యూజికల్ ఫౌంటెయిన్ నిలుస్తోంది. గురువారం రాత్రి హుస్సేన్ సాగర్‌లో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు.

బుర్జ్ ఖలీఫా తరహాలో అంటూ తలసాని
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మ్యూజికల్ ఫౌంటెయిన్ రూపంలో నగరంలో మరో అద్భుతం ఆవిష్కృతమైందన్నారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు నిర్ణయించారన్నారు. దుబాయిలో బుర్జ్ ఖలీఫా వద్ద ఉన్నట్లుగా.. సచివాలయం, మరో వైపు అంబేద్కర్, ఎదురుగా బుద్ధుడి విగ్రహం.. వీటన్నింటికీ భో చేకూర్చేలా రూ. 17.02 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ఫౌంటెయిన్, లేజర్ షో ఏర్పాటు చేశామన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా మ్యూజికల్ ఫౌంటెయిన్
ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఫౌంటెయిన్ విన్యాసాలు వీక్షించవచ్చన్నారు. కాగా, ఫార్ములా ఈ రేస్‌కు నగరం ముస్తాబవుతున్న వేళ ఈ ఫౌంటెయిన్ ప్రారంభం కావడం మరింత ఆకర్షణగా మారింది. నగర సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

హుస్సేన్‌సాగర్‌లో మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షోలు
పర్యాకులను ఆకట్టుకునేందుకు ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డును సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ మ్యూకిల్ ఫౌంటెయిన్ తోపాటు లేజర్ షోకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. లుంబినీ పార్క్, ఎన్టీఆర్ మార్గ్‌లో నిలబడి కూడా ఈ ప్రదర్శనను చూడవచ్చు. ఫాంటెయిన్, లేజర్ షో పొడవు 180 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు, 90 మీటర్ల ఎత్తుతో కొనసాగుతోంది. ఇందులో 3 జతల లేజర్లు ఉంటాయి. ఒక్కో లేజర్‌ను ఒక్కో థీమ్‌తో రూపొందించారు. దేశభక్తి గేయాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మ్యూజికల్ థీమ్స్ ప్రదర్శిస్తున్నారు. ప్రతిరోజూ మూడు షోలు, వారాంతాల్లో నాలుగు షోలు నిర్వహిస్తారు.
WoW Hyderabad! 🤩👌#HappeningHyderabad Charged Up For #HyderabadEPrix, First-Ever #FormulaE #Race In India 🇮🇳🏎️🏁
— Hi Hyderabad (@HiHyderabad) February 9, 2023
📸: @serish @FIAFormulaE @AceNxtGen @KTRBRS @arvindkumar_ias @GadwalvijayaTRS @HMDA_Gov @GHMCOnline @incredibleindia pic.twitter.com/7r3VMuubnM












Click it and Unblock the Notifications