భార్య కోసం భిక్షాటన.. కన్నీళ్లు పెట్టిస్తున్న న్యాయవాది రియల్ లైఫ్ స్టోరీ...!
కోట్లకు అధిపతి అయిన వ్యక్తి తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి యాచకుడిగా మారిన కథ.. "బిచ్చగాడు" సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం అందుకుంది. అదే విధంగా నిజ జీవితంలోనూ ఒక భర్త తన భార్య ఆరోగ్యం కోసం అన్నీ వదిలేసి భిక్షాటనకు దిగిన ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హృదయాలను కలిచివేస్తోంది. భార్యను కాపాడుకోవడం కోసం భర్త ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళ్తుందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. దీంతో ఈ ప్రముఖ న్యాయవాది రియల్ స్టోరీ అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది.
అసలు ఏం జరిగిందంటే..
పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతానికి చెందిన కాసర్ల జలంధర్ రెడ్డి 2006లో రాజన్న సిరిసిల్ల జిల్లా విలాసాగర్‌కు చెందిన శిరీషను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సాధారణ కుటుంబాల నుంచే వచ్చినా, పరస్పర ప్రేమాభిమానాలతో సంతోషంగా జీవనం సాగించారు. కరీంనగర్‌లో జలంధర్ రెడ్డి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుండగా, శిరీష ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబానికి తోడ్పడేది. వారిద్దరికీ పిల్లలు లేకపోయినా.. ఒకరిపై ఒకరు అపారమైన ప్రేమతో జీవనం సాగిస్తూ వచ్చారు.

కూలిపోయిన ఆర్థిక స్థితి..
అయితే కాలక్రమంలో శిరీష తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మొదట చిన్న సమస్యగా భావించినా, అది క్రమంగా తీవ్రతరం కావడంతో చికిత్స కోసం దంపతులు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. భార్యను కాపాడుకోవాలనే తపనతో జలంధర్ రెడ్డి తమ సంపాదనంతా ఖర్చు చేశారు. అప్పులు చేసి కూడా వైద్యం చేయించారు. కానీ ఆశించిన ఫలితం కనిపించకపోవడంతో ఆర్థికంగా పూర్తిగా కుదేలయ్యారు.
భక్తితో కఠిన నిర్ణయం..
ఈ సమయంలో వేములవాడ రాజన్న ఆలయం సన్నిధిలో భిక్షాటన చేస్తే భార్య ఆరోగ్యం మెరుగుపడుతుందనే నమ్మకం జలంధర్ రెడ్డిలో బలపడింది. అందుకే భార్య ప్రాణాల కోసం తన వృత్తిని, గౌరవాన్ని పక్కనపెట్టి ఆలయ ప్రాంగణంలో యాచకుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆలయం వద్దే భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా చిన్న చిన్న మనస్పర్థలకే విడిపోతున్న ఈ కాలంలో, భార్య కోసం అన్నీ త్యజించి దేవుడి సన్నిధిలో జీవిస్తున్న భర్త కథ ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.
జలంధర్ రెడ్డి చేసిన త్యాగం, శిరీషపై అతనికి ఉన్న ప్రేమ దంపతుల బంధానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. వారి కథ వినిన భక్తులు, స్థానికులు సహాయం అందిస్తూ దంపతులకు ధైర్యం చెప్పుతున్నారు. ఈ సంఘటన ప్రేమ, నమ్మకం, త్యాగం అనే విలువలు ఇంకా సమాజంలో ఉన్నాయని గుర్తు చేస్తోంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, నిజమైన ప్రేమ మనిషిని ఎంతటి నిర్ణయానికైనా తీసుకెళ్తుందనే సందేశాన్ని ఈ దంపతుల జీవితం అందిస్తోంది.
-
నేడే చంద్ర గ్రహణం- తెరచి వుండే ఆలయాలు ఇవే -
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.. ఆరు సార్లు ఎంపీగా సేవలు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం: పీఎం మోదీ ఆందోళన.. ఇండియాలో ఈ వస్తువుల ధరాఘాతం! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
ఈ టైమ్ లో కిమ్ ఎంటర్ అయితే ఉంటది నా సామిరంగ- ఊ అంటే చాలు -
Weather: నాలుగు రోజుల్లో వానలు.. నిప్పులు కురిపిస్తున్న భానుడు! -
APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్..! తాజా ఉత్తర్వులు..! -
Donald Trump: గల్ఫ్ దేశాల్లో షాకులతో ట్రంప్ బిగ్ యూటర్న్..! ఇరాన్ పై తాజా ప్లాన్ ..! -
16 ఏళ్ల తర్వాత బెస్ట్ ఫ్రెండుతో కలిసి పవన్ కళ్యాణ్ మూవీ..! -
viral video: యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్ లో పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం..












Click it and Unblock the Notifications