Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'సారిక ఎన్నోసార్లు ఏడ్చింది, అనిల్-సనల వివాహేతర సంబంధంపై చెప్పేది'

వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కొడుకులది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యనే అని సారిక తరఫు న్యాయవాది రెహానా అన్నారు. భర్త అనిల్, అత్తామామల పైన ఆమె 2014లో గృహహింస చట్టం కింద కేసు పెట్టిన విషయం తెలిసిందే.

సారిక తరఫున లాయర్ రెహానా వాదిస్తున్నారు. సారిక అనుమానాస్పద మృతి పైన రెహానా గురువారం విలేకరులతో మాట్లాడారు. తనను పనిమనిషిగా చూస్తున్నారని సారిక తనకు చెప్పిందన్నారు. ఈ విషయం తనతో చాలాసార్లు చెప్పిందన్నారు.

Photos: రాజయ్య కోడలు మృతి

కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని సారిక తన వద్ద ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. అనిల్ - సనల వివాహేతర సంబంధం గురించి చెబుతూ బాధపడేదన్నారు. నెల రోజుల క్రితం సారిక తనతో ఫోన్లో మాటడ్లాడిందని చెప్పారు.

Lawyer Rehana about Sarika

పదిహేను రోజుల క్రితం వచ్చి కలిసిందన్నారు. చివరిసారి కలిసినప్పుడు కూడా కంటతడి పెట్టిందన్నారు. ఎలాగైనా న్యాయం చేయాలని తన వద్ద ఏడ్చిందని చెప్పారు. అంతేకాకుండా, కోడలు సారిక సంపాదనను కూడా రాజయ్య ఇన్‌కమ్ టాక్స్‌లో చూపించారని చెప్పారు.

మృతదేహాలను తీసుకోం: సారిక తల్లి

తాము సారిక, ముగ్గురు పిల్లల మృతదేహాలను తీసుకోమని సారిక తల్లి లలిత అన్నారు. తాము అంత్యక్రియలు జరిపేది లేదన్నారు. రాజయ్య కుటుంబ సభ్యులే తన కూతురు సారికను చంపేశారని, వారే అంత్యక్రియలు జరపాలన్నారు.

ముమ్మాటికీ హత్యే: సారిక సోదరి

మాజీ ఎంపీ రాజయ్య సారిక, మనవళ్లు సజీవ దహనంపై ఆమె బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తోన్నారు. ఆమె భర్త అనిల్‌తోపాటు మామ రాజయ్య, అత్తలపై ఆరోపణలతో దుమ్మెత్తి పోస్తోన్నారు. సారికది ముమ్మాటికి హత్యేనని ఆమె సోదరి అర్చన పునరుద్ఘాటించారు.

సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. ఆమెను చిత్ర హింసలకు గురిచేశారని పేర్కొన్నారు. ఆమె భర్త అనిల్‌కు అక్రమ సంబంధాలు ఉన్నాయన్నారు. సారిక అంత్యక్రియలు వరంగల్‌లోనే నిర్వహిస్తామన్నారు.

సారిక చివరి వరకు అత్తమామలపై పోరాటం చేశారని తెలిపారు. సారికకు జరిగినటువంటి అన్యాయం లోకంలో ఎవరికీ జరగకూడదని సారిక తల్లి ఆవేదనతో తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటలను పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+