ఫ్రంట్‌కు టెంట్ కూడా దొరకదు: కేసీఆర్‌కు లక్ష్మణ్ కౌంటర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై బిజెపి రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బిజెపిని చూసి కేసిఆర్‌కు భయం పట్టుకుందని ఆయన అన్నారు.
కేసీర్ పదే పదే గుణాత్మక మార్పు అంటున్నారని, అదేమిటని ఆయన అన్నారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేయకుంటే తల నరుక్కుంటానని ఆ తర్వాత తానే పీఠమెక్కడం, సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనడం, రైతులకు బేడీలు వేయడం, ప్రతిపక్షాలనూ ప్రజా సంఘాలనూ నిర్బంధించడం, ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ఇదేనా గుణాత్మక మార్పు అని ఆయన ప్రశ్నించారు

ఒక్క మాటకైనా కట్టుబడి ఉన్నారా...
గతంలో చెప్పిన ఒక్క మాటకైనా కేసీఆర్ కట్టుబడి ఉన్నారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు కేంందరం ఇచ్చిన నిదులపై కేసిఆర్ చర్చకు సిద్ధమైనా అని ఆయన అడిగారు. 70 ఏళ్లలో సాధ్యం కాని అభివృద్ధిని ప్రధాని మోడీ నాలుగేళ్లలో చేసి చూపించారని, అందుకే ప్రజలు బిజెపికి బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు.

ఫ్రంట్‌కు టెంటు కూడా దొరకదు
దేశ ప్రజలు గతంలో కూడా ఎన్నో ఫ్రంట్లను చూశారని, సుస్థిరమైన నాయకత్వం కోసమే బిజెపికి ఓటేసి ప్రజలు మోడీని ప్రధానిని చేశారని, కేసీఆర్‌వాళ్లు పెట్టే ఫ్రంట్లకు టెంట్లు కూడా దొరకవని లక్ష్మణ్ అన్నారు.

వాపును చూసి బలుపు అని
వాపును చూసి బలుపుగా భ్రమిస్తు్న కేసిఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని లక్ష్మణ్ అన్నారు. ప్రధాని అనే గౌరవం కూడా లేకుండా మోడీని తిట్టారని ఆయన అన్నారు. కేసీఆర్ పొరపాటున నోరు జారాడని వారి సంతానం కేటీఆర్, కవిత అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆయన తప్పు ఒప్పుకుంటే...
కేసిఆర్ ఇప్పటికైనా తప్పు ఒప్పుకుంటే హుందాగా ఉంటుందని లక్ష్మణ్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానం కూడాలేని బిజెపి త్రిపురల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అన్నారు. రేపు కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణలోనూ తమదే విజయమని ఆయన అన్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications