సంచలనం: నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ 'ఆడియో టేపు' లీక్, దిగ్భ్రాంతికర విషయాలు (వీడియో)
నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి.
Recommended Video

హైదరాబాద్: విద్యార్థుల ఆత్మహత్యలతో ఇప్పటికే కావాల్సినంత చెడ్డ పేరు మూటగట్టుకున్న నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి.
నారాయణ కాలేజీ రామంతపూర్ మాజీ ప్రిన్సిపాల్ సరిత అగర్వాల్, వైస్ ప్రిన్సిపాల్ మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఆడియో టేపు ఒకటి ఇప్పుడు సంచలనానికి దారితీసింది. ఆడియో టేపులో, బ్లాక్ మనీ, నోట్ల రద్దు, వివాహేతర సంబంధాల అంశాలు కూడా చర్చకు రావడం గమనార్హం.
లైంగిక వేధింపులు
గతంలో ఆత్మహత్య చేసుకున్న శ్రీలత అనే ప్రిన్సిపాల్ వేధింపుల వల్లనే బలవన్మరణానికి పాల్పడినట్టు వీరిద్దరి మధ్య సంభాషణ సాగింది. ఉన్నతాధికారుల లైంగికంగా సహకరించకపోతే బ్లాక్ మెయిల్ చేస్తుంటారని వీరి సంభాషణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురంలో ఉన్న నారాయణ గెస్ట్ హౌస్ అరాచకాలకు అడ్డాగా మారిందని చర్చించుకున్నారు.

భారీ ఆస్తులు
నారాయణ యాజమాన్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి భారీగా ఆస్తులు పోగేసుకున్నట్టు ఆడియో టేపులో వెల్లడైంది. అతని సొంతూరితో పాటు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అతను అక్రమంగా భారీ ఆస్తులు సంపాదించినట్టు వారి సంభాషణల్లో స్పష్టమైంది. ఈమూ పెంపకం కేంద్రం, సువిశాల ఫామ్ హౌస్, పొలాలు, జూబ్లీహిల్స్ లో బంగళా, హబ్సీగూడలో పెద్ద అపార్ట్ మెంట్స్ భవనం, సర్వే ఆఫ్ ఇండియాలో ఖాళీ స్థలం తదితరాలు అతని పేరు మీద ఉన్నట్టు సరిత ఫోన్ సంభాషణలో చెబుతున్నారు.

నోట్ల రద్దు సమయంలో
టీచర్ల మధ్య సంబంధాలు, లైంగిక వేధింపుల ప్రస్తావన కూడా వీరి సంభాషణలో వచ్చింది. నోట్ల రద్దు సమయంలో తాను స్వయంగా రూ. 5 లక్షలు మార్చానని, తన వద్ద ఉన్న కరెన్సీ మార్చలేక గిలగిలా కొట్టుకున్నాడని జోకులేసుకున్నారు. అయితే అలా గిలగిలా కొట్టుకున్న వ్యక్తి ఎవరన్న దానిపై ఆడియోలో క్లారిటీ లేదు.

గొంతు నాదే.. కానీ!
ఆడియో టేపు బయటకు రావడంతో నారాయణ యాజమాన్యానికి చెందిన సరిత తార్నాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనను వేధించడానికే.. తనతో ఫోన్ మాట్లాడిన వైస్ ప్రిన్సిపాల్ నవీన్ ఈ ఆడియో టేపు లీక్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆడియో టేపులో ఉన్న గొంతు తనదే అని, కానీ ఆ స్క్రిప్టు మాత్రం మార్చేశారని సరితా ఆరోపిస్తున్నారు.
మరోవైపు తన సెల్ ఫోన్ ను హ్యాక్ చేసి, రికార్డులను తస్కరించారని, తనను హత్య చేస్తారన్న భయం ఉందని వైస్ ప్రిన్సిపాల్ నవీన్ కూడా పోలీసులను ఆశ్రయించడం గమనార్హం.

భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
ఇప్పటికే విద్యార్థుల ఆత్మహత్యలతో నారాయణ విద్యా సంస్థలు అప్రతిష్టను మూటగట్టుకున్నాయి. తాజాగా వెలుగుచూసిన ఆడియో టేపు నిర్వాకంతో విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. రామాంతపూర్ నారాయణ బ్రాంచ్ పై దాడి చేసిన విద్యార్థి సంఘాలు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. విద్యాసంస్థల అధినేత నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications