చార్మి-సిట్ సంభాషణలు లీక్: ఆ ప్రశ్నలకు మౌనంగా!.. ఇదీ విచారణ తీరు

లీకుల ప్రకారం.. కెల్విన్, పూరిల డ్రగ్స్ సంబంధాలు? జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్ లో కెల్విన్ తో సెల్ఫీల గురించి అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: పూరి & గ్యాంగ్‌లో పూరి తర్వాత డ్రగ్స్ కేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు చార్మి. కెల్విన్-చార్మీ మధ్య వెయ్యికి పైగా వాట్సాప్ సంభాషణలు ఉన్నట్లు తేలడంతో.. అతను చార్మికి చాలా క్లోజ్ అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరోవైపు చార్మి వల్లే తన భర్తకు ఈ దుస్థితి తలెత్తిందని పూరి భార్య సన్నిహితుల వద్ద వాపోతున్నారన్న ప్రచారం కూడా ఉంది.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10గం.కు సిట్ ముందు హాజరయ్యారు చార్మీ. తాజా విచారణకు సంబంధించి కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. లీకుల ప్రకారం.. కెల్విన్, పూరిల డ్రగ్స్ సంబంధాలు? జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్ లో కెల్విన్ తో సెల్ఫీల గురించి అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

leaked conversation of charmy kaur with sit

ఇవీ లీకులు..

ప్రశ్న: మీరు పబ్‌లకు వెళతారా?
సమాధానం: వెళ్తాను.

ప్రశ్న: పబ్స్‌లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందా?
సమాధానం: ఆ విషయం నాకు తెలియదు.

ప్రశ్న: కెల్విన్‌తో మీకు పరిచయం ఉందా?
సమాధానం: ఓ ఈవెంట్ లో పరిచయం అయ్యాడు.

ప్రశ్న: కెల్విన్ తో మీరు వెయ్యికి పైగా వాట్స్ యాప్ మెసేజ్ లను పంచుకున్నారు. దీనిపై మీరేమంటారు?
సమాధానం: (మౌనం)

ప్రశ్న: జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్ లో కాల్విన్ తో సెల్ఫీలు దిగారా?
సమాధానం: అందరితో దిగినట్టే, అతనితోనూ దిగాను.

ప్రశ్న: పూరీ జగన్నాథ్ మీకు స్నేహితుడేనా?
సమాధానం: అవును.

ప్రశ్న: పూరీ డ్రగ్స్ వాడతారా?
సమాధానం: వాడరు. ఆయన డ్రగ్స్ కు వ్యతిరేకి.

ప్రశ్న: మీకు ఇంటర్నేషనల్ సిమ్ ఉందా?
సమాధానం: లేదు.

ప్రశ్న: పూరీకి ఇంటర్నేషనల్ సిమ్ ఉందా?
సమాధానం: తెలియదు.

ప్రశ్న: పూరీ ఇంటర్నేషనల్ సిమ్ నుంచి మీకు ఫోన్ కాల్స్ వచ్చాయి కదా?
సమాధానం: (మౌనం)..
ప్రశ్న: మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా? వంటి ప్రశ్నలు అధికారులు చార్మికి సంధించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+