రాజధానిలో చిరుత: వణుకున్న జనం

బండ్లగూడ, కిస్మత్‌పూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఈ చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బండ్లగూడ గ్రామ పంచాయతీ వెనక ఉన్న కుంట పరిసరాల్లో ఐదు రోజుల క్రితం అర్ధరాత్రి వేళ పులి కనిపించినట్లు చర్చించుకుంటున్నారు.
ఈ ప్రాంతంలో రాత్రివేళ ద్విచక్ర వాహనంపై వెళ్లే వారిని హెచ్చరిస్తున్నారు. తమ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు రెండు గ్రామాల సర్పంచులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాగా, పోలీసులు, జూ అధికారులు, అటవీ శాఖాధికారులు సంఘటన గురించి దర్యాప్తు చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications