రొమ్ము క్యాన్సర్ వస్తే ఆడవాళ్ళను తప్పుగా చూడకండి: బాహుబలి కల్పవల్లి ఆవేదన
నటి గౌతమి స్థాపించిన ''లైఫ్ అగైన్ ఫౌండేషన్ సంస్థ'' విన్నర్స్ వాక్ పేరుతో ఆదివారం ఉదయం 5:౩౦ కి హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు,
Recommended Video

నటి గౌతమి స్థాపించిన ''లైఫ్ అగైన్ ఫౌండేషన్ సంస్థ'' విన్నర్స్ వాక్ పేరుతో ఆదివారం ఉదయం 5:౩౦ కి హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు, క్యాన్సర్ జబ్బుకు వ్యతిరేకంగా రన్ నిర్వహించారు ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు,నటి జయసుధ.,దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.,హీరో నరేష్.,మా అధ్యక్షుడు శివాజీ రాజా.,హీరొయిన్ నిత్య.,నటి ముమైత్ ఖాన్.,నిర్మాత సురేష్ కొండేటి ఇతర సిని ప్రముఖులు మరియు క్యాన్సర్ హాస్పిటల్స్ డాక్టర్స్ ,క్యాన్సర్ బాధితులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అందరూ వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
బాహుబలి సినిమాలో నటించిన కల్పవల్లి మాట్లాడుతు.,నేను రొమ్ము క్యాన్సర్ బాధితురాలినే., క్యాన్సర్ అనే జబ్బు తగ్గుతుంది క్యాన్సర్ జబ్బుని తొలి దశలో గుర్తించగలిగితే నయం చేయవచ్చు నాలుగు సంవత్సరాలు నేను పోరాడి గెలిచా., క్యాన్సర్ జబ్బు వచ్చింది అనగానే అందరు జాలి చూపిస్తారు చనిపోయినట్టే ఫీల్ అవుతారు.,దాని వల్ల వచ్చేది ఏం లేదు ఎవ్వరు భయపడొద్దు.,అంటూ ఉద్వేగానికి గురి అయ్యారు.,గౌతమి కూడా క్యాన్సర్ జయించారు, అందరికి తెలియాలి రొమ్ము క్యాన్సర్ అనే జబ్బు ఆడవాళ్ల కు ఏదో చేస్తే వచ్చేది కాదు ఆడవాళ్ళను తప్పుగా చూడకండి.,ఆడవాళ్ళూ కూడా సిగ్గు పడాల్సిన అవసరం లేదు అంటూ మాట్లాడారు.












Click it and Unblock the Notifications