హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన కానిస్టేబుల్‌కు జీవితఖైదు
హెడ్‌కానిస్టేబుల్‌ను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్‌కు జీవితఖైదు విధిస్తూ నల్గొండ జిల్లా జడ్జి డాక్టర్ జి రాధారాణి సోమవారం తీర్పు చెప్పారు.
నల్గొండ: హెడ్‌కానిస్టేబుల్‌ను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్‌కు జీవితఖైదు విధిస్తూ నల్గొండ జిల్లా జడ్జి డాక్టర్ జి రాధారాణి సోమవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల్లోకి వెళితే.. నల్గొండ మండలం అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో 2010 నవంబర్ 7వ తేదీ సాయంత్రం విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ సిహెచ్‌జివి నారాయణపై అదే బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మొదాల వీరయ్య తన తుపాకీతో కాల్పులు జరిపాడు.
దీంతో నారాయణకు నాలుగు చోట్ల తీవ్ర గాయాలయ్యాయ. వెంటనే అతడ్ని నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్లు బెటాలియన్ ఆర్‌ఎస్‌ఐ ఆర్.కేశవులు.. నల్గొండ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి రూరల్ సిఐలు ఈ.రవీందర్, కె.పాండురంగారెడ్డి విచారణ జరిపారు.

మొదాల వీరయ్య, నారాయణ 12వ బెటాలియన్‌లో ఉద్యోగం చేస్తూ బెటాలియన్‌లోనే నివసిస్త్తున్నారని, వీరయ్య భార్యతో నారాయణకు అక్రమ సం బంధం ఉందన్న అనుమానంతోనే నారాయణను అంతం చేసినట్లు పోలీసులు తమ తుది నివేదిక సమర్పించారు.
వాదప్రతివాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తీర్పునిస్తూ.. వీరయ్యకు హత్యానేరం, ఆయుధాల చట్టం ప్రకారం జీవితఖైదు, వెయ్యి రూపాయల జరిమానా విధించారు. అయితే ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని ఆమె ఆ తీర్పులో వెల్లడించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరుపున పిపి ఎం మారుతీరావు కులకర్ణి వాదించగా లైజన్ అధికారి భీమ్‌రెడ్డి సహకరించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications