మందుబాబుల కొత్త రికార్డు - అమ్మకాల రచ్చ, ఎంతో తెలుసా..!!
మందుబాబులు కొత్త రికార్డు సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సరం వేళ మద్యం అమ్మకాలు పోటీ పడి జరిగాయి. ఎక్సైజ్ అధికారుల అంచనాలకు మించి అమ్మకాలు జరిగాయి. ప్రభుత్వ ఖజానాకు కాసుల పంట పండింది. ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలు నుంచి అమ్మకాలు పెరిగాయి. తెలంగాణలో గత వారం రోజుల్లోనే దాదాపుగా రూ 1700 కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగింది. ఇక, డిసెంబర్ 31 కంటే డిసెంబర్ 30 నే మద్యం అమ్మకాలు ఎక్కువ గా జరిగాయి.
కొత్త రికార్డు
తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు కొత్త రికార్డును సృష్టించాయి. తెలంగాణలో ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.3,805 కోట్ల విలువైన 38.07లక్షల లిక్కర్ కేసులు, 45.09లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటే ఏకంగా రూ.37,682 కోట్ల విలువైన 3.76 కోట్ల లిక్కర్ కేసులు, 5.47 కోట్ల కేసుల బీర్లు విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్దారించారు. కొత్త సంత్సవరం వేళ మద్యం డిపోలకు పెద్ద మొత్తంలో ఆర్డర్లు వచ్చాయి.

ఏ నెలలో ఎంత
డిసెంబర్ 22వ తేదీ నుంచి 31 వరకు పది రోజుల్లో భారీగా మద్యం సరఫరా అయ్యింది. రెండు ఆదివారాలు, ఒక క్రిస్మస్ మూడు సెలవు రోజులు మినహా మిగిలిన 7 రోజులు డిపోల నుంచి కోట్ల విలువైన మద్యం సరఫరా చేశారు. తెలంగాణలో తొలి సారి వారం రోజుల సమయంలోనే ఏకంగా రూ.1700 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి సరఫరా జరిగింది. డిసెంబర్ 23 వ తేదీ నుంచి వారం రోజుల పాటు లెక్క చూస్తే ఏ స్థాయిలో అమ్మకాలు జరిగాయో స్పష్టం అవుతోంది. డిసెంబర్ 23న రూ.193 కోట్లు, 24వ తేదీన రూ.197 కోట్లు, 26న రూ.192 కోట్లు, 27న రూ.187 కోట్లు,
28వ తేదీన రూ.191 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి.
రికార్డు అమ్మకాలు
ఇక, కొత్త సంవత్సరం వేళ చివరి రెండు రోజుల్లోనూ భారీగా అమ్మకాలు ఉంటాయని అధికారులు అంచనా వేసారు. కాగా, డిసెంబర్ 30వ తేదీన రూ. 402 కోట్లు విక్రయాలు జరగ్గా, చివరి రోజున
31వ తేదీన రూ.282 కోట్లు మాత్రమే అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ముందుగానే మద్యం నిల్వలు మందు బాబులు సిద్దం చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 22వ తేదీ నుంచి 31 వరకు జరిగిన అమ్మకాలు రూ.1510 కోట్లు మాత్రమే జరగ్గా.. ఈ ఏడాది అందుకు అదనంగా రెండు వందల కోట్ల మేర ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. 2024 డిసెంబర్ 30 వరకు రూ.3,662 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications