మందుబాబులకు షాక్.. హోలీ రోజు షాపులు బంద్!

హోలీ పండుగను పురస్కరించుకొని మందు బాబులకు కాంగ్రెస్ సర్కారు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ వ్యాప్తంగా ఈనెల 14న మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండగ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

అలానే హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. 14వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ 6 గంటల వరకు ఆంక్షలు విధించారు. రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతే కాకుండా రోడ్లపై గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు.

liquor-shops-in-hyderabad-closed-due-to-holi-festival

ముఖ్యంగా ఎవరైనా మద్యం తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృస్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా హోలీ పండగ చేసుకోవాలని సూచించారు. మరోవైపు హోలీ పండుగ సందర్భంగా బీఫ్ దుకాణాలను మూసి వేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇక హోలీ సందర్భంగా విద్యాసంస్థలతో పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

మరోవైపు తెలంగాణలో హోలీ నిబంధనలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నిజాం పాలనలా కాంగ్రెస్ పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. హిందువుల పండగలకు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని ప్రశ్నించారు. హోలీ కోసం పోలీసులు జారీ చేసిన ఆదేశంపై రాజాసింగ్ మండిపడ్డారు. హోలీ 12 గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకని ప్రశ్నలు గుప్పించారు. 12 గంటల వరకే చేసుకోవాలని.. గుమిగూడొద్దని పోలీసులు చెబుతున్నారన్నారు. హిందూ పండగ ఎలా చేసుకోవాలో పోలీసులు చెబుతారా అంటూ ఎద్దేవా చేశారు.

హోలీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుపుకుంటారు కాబట్టి ముస్లింలు రోడ్లపైకి రాకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఉండాలన్నారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద నమాజ్ చేసుకోవాలని పోలీసులు కోరాలన్నారు. ప్రభుత్వం తన ముస్లిం అనుకూల వైఖరిని ప్రదర్శిస్తూ హిందువులు హోలీ పండగ జరుపుకోకుండా నిరోధిస్తోందని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ పోలీసులు జారీ చేసిన ఆదేశాలను "నిజామియా ఫర్మానా", తుగ్లక్ ఫర్మానా అంటూ రాజాసింగ్ అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+