Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BIGG BOSS TELUGU 5 : ఫ్రస్టేషన్‌ బయటపెట్టిన లోబో -కాజల్‌ వర్సెస్‌ సరయూ : కొట్లాటలకు కొదవే లేదు..!!

బిగ్ బాస్ -5 లో కంటెస్టెంట్స్ మధ్య కోట్లాటలకు కొదువ లేకుండా పోయింది. ప్రతీ సీజన్ లో కనిపించే కామెడీ, లవ్‌ ట్రాక్‌ల కంటే ఈ సారి గొడవ పడుతూ కంటెస్టెంట్స్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. కెప్టెన్ వచ్చాక తరువాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించటం లేదు. తొలి కెప్టెన్‌గా నియామకమైన చలాకీ సిరి వీరిని అందరినీ దారిలో పెడుతుందా అనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్ అంశంగా మారుతోంది. తొలి వారంలో కంటెస్టెంట్స్ ప్రతిభ పైన ఆడియన్స్ నిశితంగా పరిశీలన చేస్తున్నారు. కంటెస్టెంట్స్ కు మద్దతుగా సోషల్ మీడియాలో చర్చలు కూడా వైరల్ అవుతున్నాయి.

బయటకొచ్చిన లోబో ఫ్రెస్టేషన్

బయటకొచ్చిన లోబో ఫ్రెస్టేషన్

ఇక, టాస్క్ చేస్తున్న లోబో ఒక్క సారిగా తనలోని ఫ్రెస్టేషన్ బయట పెట్టేశాడు. టాస్క్‌ ప్రకారం.. అర్ధరాత్రి ఎవరు నిద్ర లేచినా ముందు కాజల్‌ను లేపాల్సి ఉంటుంది. కానీ ఈ నియమాన్ని లహరి, శ్రీరామచంద్ర ఫాలో కాకపోవటంతో అలారం మోగింది. మరోపక్క షణ్నూకు సపర్యలు చేసి అలిసిపోయాడు అతడి సేవకుడు లోబో. వారు చేయిస్తున్న టాస్క్‌లకు దండం పెట్టేశాడు. స్మోకింగ్‌ రూమ్‌లో తన ఫ్రస్టేషన్‌ను విశ్వ ముందు బయటపెట్టాడు. ఈ గేములు నాకు నచ్చట్లేదు, ఇది నా టేస్ట్‌ కాదు, నాకు సెట్టయితలేదు. పోయి నా దుకాణంలో ఉంటానంటూ.. ఇదంతా ఏంది అంటూ ప్రస్టేట్ అయిపోయాడు.

ప్రియాంక సింగ్ ను చూసి షాక్

ప్రియాంక సింగ్ ను చూసి షాక్

అయితే, ఇది టాస్కు అని...ఓపికగా ఉండాలంటూ విశ్వ చెప్పటంతో లోబో శాంతించాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో హమీదా గెలిచింది. పవర్‌ రూమ్‌లో అడుగు పెట్టిన ఆమెకు బిగ్‌బాస్‌ కఠినమైన టాస్కే ఇచ్చాడు. ఆమె ఎంచుకునే కంటెస్టెంట్‌ హౌస్‌లో ఎప్పటికీ కెప్టెన్‌ కాలేరని చెప్పాడు. దీంతో ఆమె నటి ప్రియ పేరు చెప్పింది. ఇదే విషయాన్ని హౌస్‌మేట్స్‌ దగ్గర చెప్పగా అంతా ఒక్కసారిగా షాకయ్యారు. కానీ ప్రియ మాత్రం దీన్ని స్పోర్టివ్‌గానే తీసుకున్నారు. మరో ఇంట్రస్టింగ్ సీన్ ఇక్కడ చోటు చేసుకుంది. రెస్ట్‌ రూమ్‌ క్లీన్‌ చేస్తున్న లోబో అక్కడికి వచ్చిన ప్రియాంక సింగ్‌ను చూసి తన పని ఆపేశాడు.

లోబోకు ప్రియాంక సవాల్

లోబోకు ప్రియాంక సవాల్

ఆమెను తదేకంగా చూస్తూ ఐ లవ్‌యూ అంటూ ప్రపోజ్‌ కూడా చేశాడు. అయితే ఆమె మాత్రం నీకు దమ్ముంటే మానస్‌ ఎదురుగా నాకు లైనేయ్‌ అని సవాలు చేయడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత కంటెస్టెంట్లు లోబోను అమ్మాయిగా రెడీ చేసి ఓ ఆట ఆడేసుకున్నారు. మరోవైపు ఏమైందో ఏమో కానీ సరయూ ఉన్నట్టుండి ఏడుపందుకుంది. రెండో రోజే అందరూ కలిసి ఉండి నాలుగో రోజుకే ఎలా గ్రూప్స్‌ అవుతాయని భోరున ఏడ్చేయగా యానీ మాస్టర్‌ ఆమెను ఓదార్చింది. అనంతరం హమీదా, మానస్‌, విశ్వ, సిరి తొలి కెప్టెన్సీ టాస్క్‌కు పోటీ చేయనున్నట్లు బిగ్ బాస్ ప్రకటించటంతో కొత్త టర్న్ తీసుకుంది.

కాజల్ - విశ్వ మాటల యుద్దం

కాజల్ - విశ్వ మాటల యుద్దం

తొక్కరా తొక్కు హైలెస్సా అనే టాస్కులో సైకిల్‌ నిరంతరాయంగా తొక్కుతూ దాని మీదున్న బల్బ్‌ వెలుగుతూ ఉండేలా జాగ్రత్తపడాలని సూచిస్తాడు. మధ్యలో బజర్‌ మోగిన ప్రతిసారి మిగతా హౌస్‌మేట్స్‌.. పోటీదారుల్లో ఒకరికి నీళ్లు తాగించాల్సి ఉంటుందని కండీషన్ పెడతాడు. కొంత రచ్చ జరిగినా ఎక్కువమంది ప్రియనే సంచాలకురాలిగా ఈ టాస్కుకు ఎన్నికయ్యారు. ఈ టాస్క్‌లో కాజల్‌.. విశ్వ మధ్య ఓరకంగా మాటల యుద్ధమే నడిచింది. సాగిన ఈ టాస్క్‌లో సిరి గెలుపొంది హౌస్‌కు తొలి కెప్టెన్‌గా అవతరించింది.

Recommended Video

    #BiggBossTelugu5 లో Lobo Shannu కాంబో పీక్స్.. Abhijit ని కాపీ కొట్టేదెవరు ! || Oneindia Telugu
    కెప్టెన్ సమర్ధతకు సవాల్ గా..

    కెప్టెన్ సమర్ధతకు సవాల్ గా..

    ఆమెకు ప్రియ కెప్టెన్‌ బాండ్‌ తొడిగింది. అనంతరం సిరి.. విశ్వను రేషన్‌ మేనేజర్‌గా ఎంపిక చేసింది. ఇక కిచెన్‌లో పనులు పంచుకునే దగ్గర మరోసారి గొడవ మొదలైంది. ఎవరైనా నాన్‌వెజ్‌ వండితే ఆ గిన్నెలను శుభ్రం చేయను అని ఉమాదేవి తేల్చి చెప్పింది. ఆ సమయంలో పెద్ద గొడవే జరిగింది. కెప్టెన్ జోక్యంతో అంతా కూల్ అయ్యారు. ఇక, ఇప్పుడు కంటెస్టెంట్స్ గొడవ చేస్తూ కెప్టెన్ కు చుక్కలు చూపిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+