తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్.. రేపే ముహూర్తం ఫిక్స్ !!

తెలంగాణలో స్థానిక సంస్థల (Local Body) ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయి. నోటిఫికేషన్ విడుదలకు ప్రతిబంధకాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లపై వచ్చిన పిటిషన్‌లో, నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వమని పిటిషనర్ తరఫున న్యాయవాదులు కోర్టులో అభ్యర్థించారు. కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించి, నోటిఫికేషన్ యథావిధిగా ఇవ్వవచ్చని చెప్పింది.

కాగా హైకోర్టు తీర్పు ప్రకారం, షెడ్యూల్ ప్రకారం రేపు అన్ని జిల్లా కలెక్టర్ల పరిధిలో MP/ ZPTC/ MPTC ఎన్నికల నోటిఫికేషన్ అధికారికంగా విడుదల కానుందని సమాచారం. అదే సమయంలో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

local-body-elections-notification-in-telangana-may-release-tomorrow

ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) లీగల్ టీమ్‌తో సమగ్ర చర్చలు నిర్వహిస్తోంది. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబోతోంది. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు ఎన్నికల షెడ్యూల్, సిబ్బంది కేటాయింపు, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల మానిటరింగ్ పై సూచనలు పొందుతారు.

ఎన్నికలకు సన్నాహాలు..

ప్రతి జిల్లా కలెక్టర్ ఎన్నికల భద్రత, పోలింగ్ సౌకర్యాలు, సిబ్బంది కేటాయింపు పైన ప్రత్యేక తయారీలు చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర అధికారులు, పోలీస్ సిబ్బంది ద్వారా ఎలక్షన్ మానిటరింగ్ జరుగుతుంది.

పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు రాకుండా ఇ-సర్వేలెన్స్ సిస్టమ్ అమలు చేయబడుతుంది.

బీసీ రిజర్వేషన్లపై విచారణ..

మరోవైపు బీసీ కేటగిరీ రిజర్వేషన్లపై హైకోర్టులో వచ్చే తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. కోర్టు ఇప్పటికే నోటిఫికేషన్ నిలిపివేయకూడదని స్పష్టం చేసినందున, ఇది ఎన్నికల షెడ్యూల్‌పై ప్రభావం చూపించదని భావిస్తున్నారు.రిజర్వేషన్ల విషయంలో సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపు నిర్ణయం జరగలేదని పిటీషన్ తరపు లాయర్ వాదించారు. ట్రిపుల్ టెస్ట్ గురించి ప్రధానంగా తన వాదనల్లో ప్రస్తావించారు. ఎన్నికలు వాయిదా వేయమని తాము కోరటం లేదని...చట్ట ప్రకారం వ్యవహరించాలని కోరారు.

42 శాతం రిజర్వేషన్ల బిల్లు పాసయిందా అంటూ కోర్టు విచారణ సమయంలో ప్రశ్నించింది. అసెంబ్లీలో పాస్ అయిందని.. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని ప్రభుత్వ తరపు న్యాయ వాదులు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+