మే 29 వరకు లాక్ డౌన్, ఆగస్టులో వ్యాక్సిన్, దేశం కన్నా రాష్ట్రంలో తక్కువ కేసులు: కేసీఆర్..
తెలంగాణ రాష్ట్రంలో మే 29వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని ఆయన వివరించారు. టెంపరేచర్ కూడా పెరుగుతుందని.. మరికొన్ని రోజులు ఓపిక తెచ్చుకోవాలని కేసీఆర్ కోరారు. కరీంనగర్‌లో తీసుకున్న చర్యలను సీఎం ప్రశంసించారు. ఒక్క ప్రాణం కూడా లాస్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, పోలీసులు, వైద్య సిబ్బంది, కలెక్టర్‌ను కొనియాడారు.
Recommended Video

ఆగస్టులో వ్యాక్సిన్..?
రాష్ట్రంలో కరోనా వైరస్ మొత్తం 1096 పాజిటివ్ కేసులు అని కేసీఆర్ వివరించారు. మంగళవారం 11 మందికి వైరస్ సోకిందని తెలిపారు. వీరిలో 628 మందికి వైరస్ తగ్గడంతో డిశ్చార్జ్ చేశామని తెలిపారు. మంగళవారం 43 మందిని ఇంటికి పంపించామన్నారు. ప్రస్తుతం 439 మందికి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. కరోనాకు వైరస్ కనుగొనడంలో రాష్ట్రానికి చెందిన ఫార్మా కంపెనీలు బిజీగా ఉన్నాయని చెప్పారు. తనతో మహిమ, శాంత బయోటెక్ ప్రతినిధులు చర్చించారని గుర్తుచేశారు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని వరప్రసాద్ రెడ్డి చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు.

దేశం కన్న మిన్న..
కరీంనగర్ తర్వాత కేరళలో వైరస్ నిర్మూలన కోసం పాటుపడిందని కేసీఆర్ తెలిపారు. దేశం కన్నా తెలంగాణలో కరోనా వైరస్ నిర్మూలన జరుగుతోందని కేసీఆర్ అంకెలతో మరీ వివరించారు. యాక్టివ్ కేసుల రికవరీ దేశంలో 69.21 ఉంటే.. తెలంగాణలో అది 42.7 శాతం అని తెలిపారు. రికవరీ కేసులు దేశలో 27.40 ఉంటే తెలంగాణలో 57.3గా ఉంది అని తెలిపారు. మరణాల రేటు దేశంలో 3.37 ఉంటే.. తెలంగాణలో 2.64 ఉంది అని చెప్పారు.

3 నెలలకు మందులు
వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో వ్యాధులు ఉన్నవారికి 3 నెలలకు సరిపడ మందులను అందజేస్తామని కేసీఆర్ తెలిపారు. వారు భౌతికదూరం పాటించి.. జాగ్రత్తగా మెలగాలని సూచించారు. కోటి మాస్కులను ఉచితంగానే అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాలు గ్రీన్ జోన్లలోకి వెళతాయని కేసీఆర్ చెప్పారు. మరో 11 రోజుల్లో 18 జిల్లాలు కూడా గ్రీన్ జోన్‌లోకి వెళతాయని చెప్పారు. కంటైన్మెంట్ ఏరియాలు 35 ఉండగా హైదరాబాద్‌లో 19, మిగతా జిల్లాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయని.. వాటిలో 23 జోన్ల గడువు నేటితో ముగుస్తోందని చెప్పారు. 12 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే ఉంటాయని చెప్పారు.












Click it and Unblock the Notifications