Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ పార్టీ 8వ జాబితా విడుదల: తెలంగాణ నుంచి అభ్యర్థులు వీరే

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 14 మందితో అభ్యర్థులతో కూడిన 8వ జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చెరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

తెలంగాణ నుంచి పార్లమెంట్ అభ్యర్థులు వీరే

నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి
ఆదిలాబాద్(ఎస్సీ) నుంచి డా. సుగుణ కుమారి చెలిమల
మెదక్ నుంచి నీలం మధు
భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి.

కాగా, ఇంకా నాలుగు స్థానాలైన వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్‌కు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Lok Sabha elections Congress releases 8th list with 14 candidates

మధ్యప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు

గుణ: రావు యద్వేంద్ర సింగ్
దామోహ్: తావర్ సింగ్ లోధి
విదిశ నుంచి ప్రతాప్ భాను శర్మ

జార్ఖండ్ ఎంపీ అభ్యర్థులు

కుంటి (ఎస్టీ) నుంచి కాళీచరణ్ ముండా
లోహర్ధగ (ఎస్టీ) నుంచి సుఖ్‌దేవ్ భగత్
హజారిబాగ్ నుంచి జై ప్రకాశ్ భాయ్ పటేల్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు

ఘజియాబాద్ నుంచి డాలీ శర్మ
బులంద్ షహర్ (ఎస్సీ) నుంచి శివరాం వాల్మికి
సీతాపూర్ నుంచి నకుల్ దూబే
మహారాజ్‌గంజ్ నుంచి వీరేంద్ర చౌదరి.

కాగా, 543 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఏప్రిల్ 19న ఎన్నికలు ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. 1వ దశ పోలింగ్ ఏప్రిల్ 19న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 26, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న 5వ దశ, మే 25న 6వ దశ, జూన్ 1న చివరి, 7వ దశ ఎన్నికలు జరుగుతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+