వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌ సంకేతాలు అలా ఉంటే.. లోకేష్ మాత్రం!: తనతో ఇలా చెప్పారని..

ఓవైపు రేవంత్ ఏపీ టీడీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటే.. లోకేష్ మాత్రం ఆయన పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు.రేవంత్ పార్టీ మార్పు ప్రచారం ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేశారు. టీడీపీ నుంచి కాం

|
Google Oneindia TeluguNews

విజయవాడ: టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మార్పు అంశంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఓవైపు రేవంత్ ఏపీ టీడీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటే.. లోకేష్ మాత్రం ఆయన పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు.

రేవంత్ పార్టీ మార్పు ప్రచారం ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టు రేవంత్ ఎక్కడా చెప్పలేదని, కోర్టు పని నిమిత్తం తాను ఢిల్లీ వెళ్లానని రేవంత్ తనకు చెప్పారని గుర్తుచేశారు.

lokesh response on revanth reddy party jumping issue

Recommended Video

రేవంత్ మనసు నుంచి సంచలనాలు : కేసీఆర్, పరిటాల, యనమల పై హాట్ కామెంట్స్ | Oneindia Telugu

ఇక రేవంత్‌ను తమ పార్టీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు కలిసిన విషయం తనకు తెలియదని లోకేష్ పేర్కొనడం గమనార్హం. అయితే రేవంత్‌తో తన భేటీ కేవలం వ్యక్తిగతమే అని కంభంపాటి చెబుతున్నప్పటికీ.. చంద్రబాబు ఆదేశం మేరకే ఆయన భేటీ జరిగిందన్న ప్రచారం కూడా ఉంది.

మొత్తం మీద రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ నేతల పైనే విమర్శలు ఎక్కుపెట్టి పార్టీ మారుతున్నట్లు స్పష్టమైన సంకేతాలే పంపించారు. కేసీఆర్ కు వ్యతిరేకేంగా రాజకీయ పునరేకీకరణ చేస్తానన్న రేవంత్ భవిష్యత్తులో ఏ దిశగా ముందడుగు వేస్తారో వేచి చూడాలి.

English summary
AP Minister Lokesh condemned Revanth Reddy party change issue, he said Revanth never mentioned that in his statements
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X