ఎవరు మాస్టర్?: బాబు దారిలో.. కెసిఆర్‌పై లెక్కతప్పిన 'టెక్కీ'

హైదరాబాద్: భాగ్యనగరాన్ని ఐటీలో అంతర్జాతీయస్థాయిలో నిలిపిన వ్యక్తి టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. టెక్నాలజీకి చంద్రబాబు మారుపేరు. విభజన నేపథ్యంలో ఇప్పుడు సమైక్య ఏపీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా అయింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే అంతర్జాతీయస్థాయిలో.. చంద్రబాబు వల్ల గుర్తింపు పొందిన హైదరాబాదు నగరాన్ని తెలంగాణ సీఎం కెసిఆర్ మరింత ముందుకు తీసుకు వెళ్తున్నారు. తద్వారా ఆయన చంద్రబాబును మించి సాఫ్టువేర్ రంగంలో హైదరాబాదును నిలిపే దిశలోదూసుకు పోతున్నారు.

సాఫ్టువేర్ విషయంలో తెలంగాణ సీఎం కెసిఆర్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావులు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. నగరంతో పాటు చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా టెక్నాలజీని, సాఫ్టువేర్ సంస్థలను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

హైదరాబాద్

హైదరాబాద్

ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని సాఫ్టువేర్ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికా బద్ధంగా సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ ఉద్యమం సమయంలో.. హైదరాబాద్ నుంచి సాఫ్టువేర్ కంపెనీలు, పరిశ్రమలు తరలి వెళ్తాయని చాలామంది భావించారు. పలు కంపెనీలు కూడా ఆ దిశలో ప్రణాళికలు కూడా సిద్దం చేసుకున్నాయి. కొన్ని వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉద్యమం సమయంలో చెన్నై, బెంగళూరు వంటి నగరాల వైపు చూసిన సంస్థలు ఇప్పుడు.. తిరిగి హైదరాబాద్ వైపు చూస్తున్నాయని చెబుతున్నారు.

కెసిఆర్

కెసిఆర్

2014లో కెసిఆర్ అధికారంలోకి వచ్చాక.. సాఫ్టువేర్ రంగం పైన, పారిశ్రామిక రంగం పైన ఆయన కనబరుస్తున్న శ్రద్ధ వల్లే హైదరాబాద్ తరలి వస్తున్నారని చెబుతున్నారు. సాఫ్టువేర్ రంగానికి కూడా కెసిఆర్ బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల కెసిఆర్ అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చి ఆకట్టుకున్నారు.

సాఫ్టువేర్

సాఫ్టువేర్

సాఫ్టువేర్ రంగ అభివృద్ధి కోసం ఇటీవలే ఐటీ పాలసీని తీసుకు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చర్యల వల్ల వెనక్కి వెళ్లిన, వెళ్లాలనుకున్న సంస్థలు మళ్లీ హైదరాబాదునే చూస్తున్నాయి.

చంద్రబాబు

చంద్రబాబు

చంద్రబాబు పేరు ఎత్తితే టెక్నాలజీ గుర్తుకు వస్తుంది. ఐటీ పైన ఆయనకు మక్కువ ఎక్కువ. అదే సమయంలో గతంలో కెసిఆర్‌కు ఐటీ పైన అవగాహన లేదని, సాఫ్టవేర్ పైన ఇంతటి స్థాయిలో దృష్టి సారించరేమోననే అనుమానాలు కూడా వ్యక్తం చేసిన వారు ఉన్నారు.

కెసిఆర్

కెసిఆర్

కానీ, ఇప్పుడు కెసిఆర్... టెక్నాలజీ మాస్టర్ అయిన చంద్రబాబునే మించిపోయేలా.. సాఫ్టువేర్ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రణాళికతో వెళ్తున్నారని అంటున్నారు. ఓ విధంగా బాబు కంటే దూకుడు కనిపిస్తోందని అంటున్నారు. చంద్రబాబు పేరు మరిపించేలా దూసుకెళ్తున్నారని అంటున్నారు.

హైదరాబాదుకు

హైదరాబాదుకు

ఇప్పటికే హైదరాబాదుకు అంతర్జాతీయస్థాయిలో పేరు ఉంది. అందుకు చంద్రబాబే కారణమని చెప్పవచ్చు. ఇప్పటికే హైదరాబాదుకు టెక్నాలజీ నగరంగా గుర్తింపు ఉండటం కెసిఆర్‌కు ఎంతో కలిసి వచ్చే అంశం.

చంద్రబాబు

చంద్రబాబు

అదే సమయంలో చంద్రబాబు విజనరీ కూడా చాలా గొప్పది. అయితే చంద్రబాబును దృష్టిలో పెట్టుకొని కెసిఆర్‌కు అంత అవగాహన ఉందా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సాఫ్టువేర్ రంగంలో కెసిఆర్ పైన పెట్టుకున్న అంచనాలకు భిన్నంగా ఉన్నందు వల్ల చంద్రబాబు కంటే దూకుడు కనిపిస్తోందని అంటున్నారు.

చంద్రబాబును

చంద్రబాబును

కానీ టెక్నాలజీ అభివృద్ధి విషయంలో చంద్రబాబును ఏమాత్రం తీసిపారేయలేని, అయితే కొత్త రాష్ట్రమైనందున ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. ఆయన విజన్ చాలా గొప్పదని గత రెండు దశాబ్దాలుగా పేరు గాంచారు. మంచి ఆలోచనలు ఆయన సొంతం. కొత్త రాష్ట్రం అయినందున ఆయనకు కొంత సమయం పట్టవచ్చునని అంటున్నారు. విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాల పైన చంద్రబాబు దృష్టి పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+