ఆకాశంలో శంకరుడు.. హైదరాబాద్‌లో అద్భుతం..!?
హైదరాబాద్ : బోనాల పండగ సెంటిమెంట్‌తో హైదరాబాద్ నగరం ముసురేసింది. ఆదివారం నుంచే భాగ్యనగరంలో తేలికపాటు జల్లులు కురుస్తోన్నాయి. ఇక సోమవారం ఇష్టదైవం శివుడిని ప్రార్థిస్తారు భక్తులు. తమ ఇలవేల్పును భక్తులు కొలుస్తున్నారో ఏమో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఔను శివుడి రూపంలో కనిపించిన దృశ్యరూపం భక్తులకు కనువిందు చేసింది. అయితే ఇదీ హైదరాబాద్‌లో జరిగిందా ? ఇతర ప్రాంతాల్లో జరిగిందా అనే అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సోమవారం రోజున ఆకాశంలో శివుడి రూపం ప్రతిబించింది. దానిని చూసిన వారు హర హర మహాదేవ శంభోశంకర అంటూ కీర్తించారు. మరికొందరు ఆకాశలో ఆకారం చూసి తన్మయత్వం పొందారు. అయితే సోమవారం రోజున ఈ దృశ్యం కనిపించడంతో భక్తుల సెంటిమెంట్ రెట్టింపయ్యింది. తమ ఆరాధ్యదైవం తమకు ఇంపుగా కనిపించారని చెప్తున్నారు. ఉరుములు, మెరుపులు మధ్య తేలికపాలు జల్లులు కురుస్తోన్న సమయంలో ఈశ్వర భగవంతుడు కనిపించి కనువిందు చేశాడు. ఆ వీడియో చూసిన వారు, ప్రత్యక్షంగా తిలకించిన వారు శివుడు పేరును రెట్టింపు ఉత్సాహంతో స్మరిస్తున్నారు.

ఈ వీడియో ఎక్కడిది అనే వివరాలు తెలియరాలేదు. ఓ ఔత్సాహికుడు సోషల్ మీడియాలో షేర్ చేయడతో ట్రోల్ అవుతుంది. దానిని చూసిన వారు కూడా తన్మయత్వం పొందుతున్నారు. మరికొందరు తమ ఇష్టదైవం తమ చెంతకే వచ్చాడని సంభ్రమాశ్చర్యానికి గురవుతున్నారు. చూసిన ప్రతీ ఒక్కరు ఓం నమ: శివాయ అంటూ మనసులో ప్రార్థిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు స్వయంగా చూసే అవకాశం రాలేదని .. వీడియో చూసి పుణ్యం కట్టుకుంటామని చెప్తున్నారు. మొత్తానికి బోనాల పండుగ తర్వాత తెల్లవారి జరిగిన ఈ ఘటనతో శివ భక్తులంతా ఆశ్చర్యానికి గురవుతూనే భోలేనాథ్ రూపంలో ఉన్న శివుడిని దర్శించుకుంటున్నారు. అయితే ఇది నిజంగా జరిగిందా ? లేదంటే కొందరు గ్రాఫిక్స్‌తో వాడారా అనే అంశంపై కూడా స్పష్టత రాలేదు. నిజంగా జరిగి ఉందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. మరికొందరు తమ స్వార్థం కోసం కూడా చేసి ఉంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications