పెళ్లి... కొద్దిరోజులకే ఊహించని ట్విస్ట్... ఆ విషయం తెలిసి భర్త విడాకులు... చివరకిలా...
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి అదే జిల్లాకు చెందిన ఓ యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగా పెద్దలు మాత్రం ససేమిరా అన్నారు. ఇంతలో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా మరో యువకుడితో వివాహం చేశారు. అయితే అప్పటికే ఆమె గర్భవతి అని తెలియడంతో భర్త విడాకులు ఇచ్చాడు. చివరకు పోలీసుల చొరవతో ప్రియుడితో ఆమె వివాహం జరిగింది.

రెండేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమ...
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారంకు చెందిన రజిత(పేరు మార్చాం),కుసుమంచి మండలం నర్సింహులు గూడెంకు చెందిన కళ్యాణ్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.ఈ క్రమంలో ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని పెద్దలతో ప్రేమ విషయం చెప్పారు. అయితే ఇరువురి పెద్దలు అందుకు అంగీకరించలేదు. ఇంతలో కుటుంబ సభ్యులు ఆమెకు వేరే యువకుడితో బలవంతంగా పెళ్లి చేశారు.

గర్భవతి అని తెలియడంతో..
పెళ్లయిన కొద్ది రోజులకు రజిత అనారోగ్యం బారినపడింది. దీంతో స్ధానిక అస్పత్రిలో భర్త పావనికి వైద్య పరీక్షలు చేయించగా... అప్పటికే అమె గర్భవతి అని తెలిసింది. దీంతో భర్త రజితను నిలదీయగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. ఆ తర్వాత రజితకు అతను విడాకులు ఇచ్చాడు. దిక్కు తోచని స్థితిలో రజిత ఖమ్మం షీ టీమ్ సీఐ అంజలిని కలిసి జరిగిన విషయం చెప్పింది. తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

ఒక్కటైన రజిత-కల్యాణ్...
సీఐ అంజలి చొరవ తీసుకుని గతంలో పావని ప్రేమించిన యువకుడి తల్లిదండ్రులను,ఆమె తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించింది. అక్కడ ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహించగా.. ఎట్టకేలకు ఇరు కుటుంబాలు వారికి పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నాయి. షీ టీమ్ సభ్యుల సమక్షంలోనే రజిత-కల్యాణ్‌ల వివాహం జరిగింది. కొత్త జంటకు సీఐ అంజలి సహా అక్కడి పోలీసులు శుభాకాంక్షలు తెలియజేశారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications