వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమికులకు ఆ గుళ్ళో పెళ్ళిళ్ళు నిషేదం

By Narsimha
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: ప్రేమికులకు ఆర్య సమాజం, గుళ్ళు వివాహం చేసుకొనేందుకు మంచి వేదికలు.తల్లి డండ్రులు ఒప్పుకోకపోతే చాలా మంది ప్రేమికులు ఆర్య సమాజ్ లేదా, దేవాలయాలను ఆశ్రయిస్తారు . కాని, కరీంనగర్ జిల్లాలోని ఓ దేవాలయంలో ప్రేమికులకు పెళ్ళిళ్ళు జరపబోమని ఆలయగేటుకు బ్యానర్ కట్టారు.ప్రేమ విహాహాలను ఆ గుళ్ళో నిషేదించారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ ఎం డి కాలనీలోని లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో ప్రేమ పెళ్ళిళ్ళను నిషేదించారు.ఈ మేరకు ఆలయ గేటుకు బ్యానర్ ను కట్టారు ఆలయ పాలకవర్గ సభ్యులు.ఈ గుళ్ళో ప్రేమ పెళ్ళిళ్ళు నిషేదించడానికి పెద్ద కారణమే ఉంది.

love marrages not allowed temple

అన్ని దేవాలయాల్లో మాదిరిగానే ఈ దేవాలయంలో కూడ ప్రేమికులకు వివాహాలు జరిపించేవారు.ఈ ఏడాది అక్టోబర్ 19వ, తేదిన మహాంకాళి అనిల్, హస్తపురం మౌనిక లు ఈ ఆలయలో వివాహంచేసుకోవడానికి వచ్చారు.విషయం తెలుసుకొన్న మౌనిక కుటుంబసభ్యులు ఆళయం వద్దకు వచ్చి అనిల్ కు చావబాదారు. గుళ్ళోనే అనిల్ ను తీవ్రంగా కొట్టారు.

మౌనిక కుటుంసభ్యుల కొట్టిన దెబ్బలకు తాళలేక అనిల్ గుడిలోనే చనిపోయాడు.కొద్దిసేపట్లో ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని వచ్చిన అనిల్ మరణించడం ఆలయ సిబ్బంది దిగ్బ్రాంతికి లోనయ్యారు.ఆ రోజు నుండి ప్రేమ పెళ్ళిళ్ళు చేయకూడదని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకొంది.. ఈ నిర్ణయం మేరకే ఆలయ గేటుకు బ్యానర్ ను కట్టారు.మరో వైపు ఆలయ ఆదాయం కూడ గణనీయంగా తగ్గిపోయింది. ప్రేమ పెళ్ళిళ్ళు జరిగే సమయంలో కొత్త జంట నుండి వివాహా అనుమతి కోసం 5 వేల రూపాయాలను దేవాలయ పాలకవర్గం తీసుకొంటుంది. ప్రేమ పెళ్ళిళ్ళ నిషేదం కారణంగా ఆదాయం కూడ తగ్గిపోయిందని పాలకవర్గ సభ్యులు మదనపడుతున్నారు.

English summary
love marrages are banned in karimnagar district lmd laxminarsimha swamy temple.behind this decission strong cause said temple management.2016 oct19, lovers anil, mounika come to temple for marrage, this information got mounika parents also came temple. mounika parents attack anil, anil spotdead in the temple, so temple management decided banned love marrages
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X