‘‘కేసులు విత్‌డ్రా చేసుకోకుంటే నీ నగ్న వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా..’’
హైదరాబాద్ : ప్రేమ పేరుతో నమ్మించిన ఓ యువకుడు ఓ యువతిని నిలువునా దోచుకున్నాడు. పెళ్లిచేసుకుంటానంటూ నమ్మించి ఆమెతో సహజీవనం చేసి ఆనక తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడు. మరో యువతిని ప్రేమించడం మొదలుపెట్టాడు.
దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అతడిపై కేసు పెట్టింది. ఇక అప్పట్నించి అతడితో రాక్షసుడు నిద్ర లేచాడు. తనపై పెట్టిన కేసులను విత్‌డ్రా చేసుకోకపోతే ఆమె న్యూడ్ వీడియోలను యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. తాజాగా మాట్లాడుకుందామంటూ ప్రియురాలిని ఓ పబ్ వద్దకు పిలిచి ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

స్నేహం, ప్రేమ, సహజీవనం ఇలా...
మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో నివాసం ఉంటున్న యువతి(25) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ఏడాది క్రితం ఆసిఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మహబూబ్ షరీఫ్(30)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహం, ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని అతడు నమ్మించడంతో ఇద్దరూ కొన్ని రోజులపాటు సహజీవనం కూడా చేశారు.

పెళ్లి మాట ఎత్తేసరికి బయటపడిన నైజం...
తీరా ఆ యువతి పెళ్లిమాట ఎత్తేసరికి ప్రియుడి మాట, తీరు అన్నీ మారిపోయాయి. ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు ఆమెనుంచి సుమారు రూ.10 లక్షల నగదు, బంగారం కూడా తీసుకున్నాడు. అంతేకాదు, ఇటీవల మరో యువతితో సన్నిహితంగా ఉంటున్న మహమూద్ తన కొత్త ప్రేయసితో కలిసి బాధితురాలిపై దాడికి కూడా దిగాడు.

‘‘నగ్న ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తా’’...
మహ్మద్ మహబూబ్ షరీఫ్ వేధింపులు భరించలేక బాధితురాలు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును విత్‌డ్రా చేసుకోకపోతే ఆమెకు సంబంధించిన నగ్న ఫొటోలు, వీడియోలు యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ షరీఫ్ ఇటీవల ఆమెపై బెదిరింపులకు దిగాడు.

పబ్ వద్దకు రమ్మని పిలిచి, దాడి...
ఈ నెల 24 అర్ధరాత్రి దాటిన తర్వాత జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.45లోని ఓ పబ్ వద్దకు రావాలని పిలిచిన మహమూద్ తీరా ఆమె అక్కడికి వచ్చాక మరోసారికి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications