దొంగలో మార్పు తెచ్చిన ప్రేమ...పాత కేసులు ఆయన ప్రాణం తీశాయి

ఓ దొంగ జీవితంలో ప్రేమ మార్పు తెచ్చింది. కాని, పాత కేసుల కారణంగా ఆయన ఆత్మహత్యచేసుకొన్నాడు. సతీష్ దొంగతనం చేసేవాడు. సుగుణతో ప్రేమ అతనిలో మార్పును తెచ్చింది.

హైదరాబాద్ :ఇద్దరి మద్య ప్రేమ ఎందుకు పుడుతోందా..ఎలా పుడుతోందో చెప్పలేమని చాలా సినిమాల్లో డైలాగులు వినే ఉంటాం. అయితే దొంగ అని తెలిసి ఓ వ్యక్తిని ప్రేమించింది ఓ యువతి. ఈ ప్రేమ కారణంగా ఆ యువకుడిలో మార్పు వచ్చింది. పాత పద్దతులకు స్వస్థిచెప్పాడు. కష్టం చేసి బతుకుతున్నాడు. కాని, పాత కేసులు ఆయనను వెంటాడడంతో ఆత్మహత్య చేసుకొన్నాడు.

ప్రేమ కారణంగా పరివర్తన వచ్చినా.... పని లేక దొంగతనాలు మానివేసి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ యువకుడికి పాత కేసులు తోడు కావడంతో .. ఇరుగుపొరుగు వారికి తన గత చరిత్ర తెలిసి మనోవేదకు గురై ఆత్మహత్య చేసుకొన్నాడు.


'ప్రేమ'తో మారిన సతీష్

లాల్ దర్వాజకు చెందిన సతీష్ అనే యువకుడు నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసేవాడు. పలు కేసుల్లో ఆయన జైలు శిక్షను కూడ అనుభవించాడు. అయితే జంగంమెట్టుకు చెందిన సుగుణతో సతీష్ ప్రేమలో పడ్డాడు. సతీష్ నేరమయ చరిత్ర తెలుసుకొన్న సుగుణ దొంగతనాలు మానితేనే ప్రేమను కొనసాగిస్తానని తేల్చి చెప్పింది.దీంతో ఆమె ప్రేమ కోసం సతీష్ దొంగతనాలు మానివేశాడు.

lover changes thief life

దొంగతనాలు మానివేసిన సతీష్ తో సుగుణ ప్రేమను కొనసాగించింది. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని భావించారు.కాని, పెద్దలు మాత్రం ఈ వివాహనికి ఒప్పుకోలేదు.పెద్దలను ఎదిరించి వీరిద్దరూ వివాహం చేసుకొన్నారు.దొంగతనాలు మానేసి కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.సరిపోను పనిలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల పాలయ్యాడు.

అయితే ఇదే సమయంలో సతీష్ కు నెలరోజులుగా పాత కేసులకు సంబందించి కోర్టు కేసులకు హజరుకావాలని నోటీసులు వస్తున్నాయి.అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోర్టు వాయిదాలకు వెళ్ళలేదు. రెండు రోజుల క్రితం సుగుణ పుట్టింటికి వెళ్ళింది. అదేసమయంలో కానిస్టేబుల్ సతీష్ వద్దకు వచ్చి సమన్లు ఇచ్చాడు. సతీష్ గత చరిత్రను ఇరుగుపొరుగు వారిక చెప్పాడు. మనోవేదనకు గురైన సతీష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. పుట్టింటి నుండి వచ్చిన సుగుణకు భర్త ఆత్మహత్య చేసుకోవడం కన్నీరుమున్నీరుగా విలపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+