ప్రేమికుడి మోసం బెడిసికొట్టింది.. ఆసుపత్రిలో ప్రేమ పెళ్లి..!

సిరిసిల్ల : ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానంటూ మాటిచ్చాడు. తీరా ముగ్గులోకి దించి శారీరకంగా వాడుకున్నాడు. ప్రియురాలు గర్భం దాల్చిందని తెలిసి మొహం చాటేశాడు. గ్రామస్తులంతా ఏకతాటిపై నిలిచి బాధితురాలికి సపోర్ట్ చేయడంతో సదరు యువతిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. ప్రేమ పేరుతో యువతిని మోసగించాలనుకున్న ఆ యువకుడు చివరకు తన తప్పు తెలుసుకున్నాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది. చిన్నబోనాల గ్రామానికి చెందిన ముత్యాల రాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన లక్ష్మి అనే యువతిని ప్రేమించాడు. అలా వారిద్దరి మధ్య ప్రేమాయణం దాదాపు ఐదేళ్ల నుంచి కొనసాగుతోంది.

lover cheated and villagers protected at last love marriage held

అయితే ప్రేమ పేరుతో దగ్గరైన రాజు.. ఆ యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆమెకు గర్భం వచ్చిందని తెలియగానే అప్పటినుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. అదలావుంటే నెలలు నిండి ప్రసవానికి ఆసుపత్రిలో చేరింది లక్ష్మి. మృత శిశువుకు జన్మనివ్వడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆ మేరకు జిల్లా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న గ్రామస్తులు వారిద్దరినీ ఒకటి చేసే ప్రయత్నం చేశారు. బాధితురాలికి న్యాయం చేసేందుకు అంతా ఒక్కటయ్యారు. ఆ క్రమంలో రాజును కలిసి మాట్లాడారు. అలా గ్రామస్తుల చొరవతో వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. చివరకు తన తప్పు తెలుసుకున్న రాజు.. లక్ష్మిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. అలా అందరి సమక్షంలో ఆసుపత్రికి వెళ్లి ఆమె మెడలో తాళి కట్టాడు. మోసం చేయాలనుకుని చివరకు తన తప్పు తెలుసుకున్న రాజు ఆమెను జీవిత భాగస్వామిగా స్వీకరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+