లవర్‌తో ఉంటున్న ప్రియుడు సూసైడ్, బాలుడిపై రేప్
హైదరాబాద్: ప్రేమించిన యువతిని వదులుకోలేక, కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులో జరిగింది. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంకు చెందిన అనిల్ కుమార్ అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఆమెతో కలిసి ఆర్టీసి కాలనీలో నివసిస్తున్నాడు. అతను ఓ కూల్ డ్రింక్ కంపెనీలో హెల్పర్‌గా పని చేస్తున్నాడు.

అనిల్ కుమార్‌కు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురయ్యారు. బుధవారం సాయంత్రం యువతి లేని సమయంలో అతను గదిలో ఉరి వేసుకున్నాడు. ఇంటికి వచ్చిన ఆమె అనిల్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తించింది. పోలీసులకు సమాచారం అందించారు.
బాలుడిపై అత్యాచారం
తొమ్మిదేళ్ల బాలుడి పైన ఓ కార్మికుడు అత్యాచారం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్ట బార్కాస్‌కు చెందిన హఫీజ్ ఇందిరానగర్లోని ఓ ఫంక్షన్ హాలులో పని చేస్తున్నాడు. ఇందిరానగర్లో ఉండే బాలుడుకి చాక్లెట్లు ఆశ చూపించి గురువారం అత్యాచారం చేశాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications