వదిలి వెళ్లిందని ప్రియురాలిపై అక్కసు: యూట్యూబ్‌లో నగ్న దృశ్యాలు పెట్టి బ్లాక్‌ మెయిల్‌

హైదరాబాద్: తనతో శారీరక సంబంధం పెట్టుకున్న యువతి, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని తనను దూరం పెట్టిందనే కోపంతో ఇద్దరూ శారీరకంగా కలిసి ఉన్నప్పుడు రహస్యంగా తీసిన వీడియోను యూట్యూబ్‌లో పెట్టేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా హసన్‌పర్తికి చెందిన ఓ యువతి (23)... 2012 నుంచి 2014 వరకు ఉద్యోగ శిక్షణా తరగతుల కోసం బేగంపేటకు వచ్చి వెళ్లేది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న శీలబోయిన అనిల్‌ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మంచి 2014లో ఆమెను రహ్మత్‌నగర్‌లోని గురుద్వార్ సమీపంలో ఉన్న తన గదికి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమెకు తెలియకుండా ఆ లైంగిక దృశ్యాలను వీడియో తీశాడు. కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.

lover uploaded sensitive video in youtube

దీంతో ఇటీవలే కుటుంబ సభ్యులు ఆమెకు మరోకరితో పెళ్లి చేశారు. తన ప్రియురాలు తనని వదిలి వెళ్లిపోయిందన్న అక్కసుతో దీనిని జీర్ణించుకోలేని అనిల్ ఆమెతో కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. గతనెల 2న బాధితురాలి స్నేహితులు ఈ దృశ్యాలు చూసి ఆమెకు తెలియజేశారు.

అంతేకాకుండా ఈ విషయం అత్తవారింట్లో తెలియడంతో గొడవకు దారితీసింది. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అనిల్‌పై ఐపీసీ సెక్షన్ 354(బి), 506, 509, 417, 420ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+