ఆవేశంలో ఉరేసుకున్న ప్రియుడు, నిప్పంటించుకున్న ప్రియురాలు: బావామరదళ్లు మృతి

రంగారెడ్డి: శంకర్‌పల్లి మండలం టంగుటూరులో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. వారు ఇద్దరు బావామరదళ్లు. ప్రేమలో ఉన్నారు. కానీ చిన్న చిన్న గొడవలకు మనస్థాపానికి లోనై అర్ధంతరంగా తనువు చాలించారు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరులో జరిగింది.

ఎల్లేష్‌(22), లావణ్య (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం ఫోన్లో ఇద్దరూ గొడవపడ్డారు. మనస్థాపం చెందిన ఎల్లేష్‌ గ్రామ సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలియగానే లావణ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకొని చనిపోయింది. వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆవేశంలో ప్రియుడు ఆత్మహత్య, ఆమె కూడా

ఆవేశంలో ప్రియుడు ఆత్మహత్య, ఆమె కూడా

క్షణిక ఆవేశంలో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడగా, విషయం తెలియగానే ఆమె నిప్పంటించుకొని మృతి చెందటం గ్రామంలో విషాధఛాయలు నింపింది. ఎల్లేష్ గచ్చిబౌలిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతని మేనత్త కూతురు లావణ్య. వీరిద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

 మద్యం తాగి, మనస్పర్థలు

మద్యం తాగి, మనస్పర్థలు

ఆదివారం రాత్రి ఎల్లేష్ తన స్నేహితుడితో కలిసి మద్యం తాగాడు. అనంతరం ప్రియురాలితో ఫోన్లో మాట్లాడాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. మనస్తాపానికి గురైన యువతి ఫోన్‌ కట్‌ చేసింది. ఆ బాధలో ఇంటికెళ్లిన ఎల్లేష్ ఇంట్లో వారితోను గొడవ పడ్డాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.

చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్

చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్

ఆ తర్వాత, తనకు బతకడం ఇష్టం లేదని, చనిపోతున్నానని ఒకరిద్దరు మిత్రులకు చెప్పి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతని కోసం వెతికారు. పొలంలో చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. ఎల్లేష్ మరణవార్త విని లావణ్య కుటుంబం ఇంట్లో నుంచి ఎల్లేష్ ఇంటికి బయలుదేరింది.

ఫిర్యాదుతో విచారణ

ఫిర్యాదుతో విచారణ

అప్పుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో లావణ్య కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకుంది. వారు తమ ప్రేమ విషయాన్ని ఇంతవరకు ఇంట్లో చెప్పలేదని మృతుల తల్లిదండ్రులు విలపించారు. ఎల్లేష్ తండ్రి సత్తయ్య, లావణ్య సోదరుడు రాజ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మనస్పర్థల కారణంగానే క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+