ప్రేమికులు: ఒంటిపై కిరోసిన్ పోసుకుని చచ్చిపోతామని పీఎస్‌లో హైడ్రామా
హైదరాబాద్: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట పెద్దలకు భయపడి ఒంటిపై కిరోసిన్ పోసుకుని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోయిన్‌పల్లి ఆర్యసమాజ్ వద్ద నివాసం ఉండే కీర్తిరెడ్డి, బాపూజీ నగర్‌కు చెందిన భవానీశంకర్ (22) గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
నాలుగు రోజుల క్రితం కీర్తిరెడ్డి మేజర్ కావడంతో కూకట్ పల్లిలోని ఆర్యసమాజ్‌లో వీరిద్దరూ ఈనెల 21న వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం రెండు రోజుల క్రితం బోయిన్ పల్లి పోలీసుల వద్దకు వచ్చిన పెళ్లి చేసుకున్న విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

ఇదే విషయాన్ని కీర్తిరెడ్డి తల్లిదండ్రులకు పోలీసులు తెలియజేశారు. దీంతో కీర్తిరెడ్డి తల్లిదండ్రుల కోరిక మేరకు మాట్లాడేందుకు వారిని శుక్రవారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. గత రెండు రోజులుగా బెదిరింపు కాల్స్ చేస్తుండటంతో పోలీసులు రమ్మని చెప్పడంతో ఏం జరుగుతుందోనని ఊహించి స్టేషన్ వచ్చే ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు.
దీంతో ఇద్దరూ మేజర్లు కావడంతో ఇలా చేయకూడదని పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications