పెళ్లి చేయండి, చేసుకోను: పీఎస్‌లో లవర్స్ హల్‌చల్
హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలని ఓ యువజంట పోలీసు స్టేషన్‌లో హల్ చల్ చేసిన సంఘటన హైదరాబాదులో పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. హేమలత, శివలు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి విషయానికి వచ్చేసరికి శివ వద్దన్నాడు.
దీంతో హేమలత బుధవారం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు శివతో కలిసి వచ్చి పెళ్లి చేయాలని లేదంటే ఇక్కడ్నుండి వెళ్లేది లేదని భీష్మించింది. శివ మాత్రం తాను పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో కేసు పెడితే నమోదు చేస్తామని పోలీసులు యువతికి చెప్పారు. తాను కేసు పెట్టనని ఆమె చెప్పింది.

దీంతో మీరు మాట్లాడుకొని అవగాహనకు రావాలని పోలీసులు సూచించారు. దాంతో హేమలత తన వెంట తెచ్చుకున్న ర్యాట్ కిల్లర్స్‌ను తినే ప్రయత్నం చేసింది. శివ ఆమె చేతిలో నుండి వాటిని లాక్కొనే ప్రయత్నం చేశాడు. పోలీసులు ఇద్దర్ని మందలించారు.












Click it and Unblock the Notifications