దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణాలలో ఈ జిల్లాలలోనే వర్షాలు!
తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలెర్ట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కూడా వాతావరణ శాఖ అల్పపీడన ప్రభావం ఉంటుందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా బలపడుతుందని పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల పైన ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు.
నేడు ఈ జిల్లాలలో వర్షాలు
ఈ అల్పపీడనం ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నేడు వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, జనగామ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

రేపు ఈ జిల్లాలలో వర్షాలు
అల్పపీడన ప్రభావంతో రేపు హన్మకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లా, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం, రాత్రి వేళలలో పొగ మంచు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఏపీపైన కూడా అల్పపీడన ప్రభావం
ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. ఉపరితల గాలులు ఆగ్నేయ తూర్పు దిశలో గంటకు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వెల్లడించారు. అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కూడా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది .ముఖ్యంగా దక్షిణ తీర ప్రాంతాల పైన , రాయలసీమలోనూ ఈ అల్పపీడన ప్రభావం అధికంగా చూపించనుంది.
ఏపీలో ఈ జిల్లాలలో వర్షాలు
చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాలలో అల్పపీడన ప్రభావంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం వెళ్లే రైతులు వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని సూచిస్తుంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications