తెలంగాణకు మరో భారీ పెట్టుబడి: లులూ గ్రూప్ రూ. 3500 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్: తెలంగాణలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్రంలో దశలవారీగా రూ. 3500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు లులూ గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో పెట్టుబడుల కార్యాచరణను ప్రకటించారు.

ఇప్పటికే రూ. 300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో షాపింగ్ మాల్ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే లులూ మాల్‌కు సంబంధించి 80 శాతం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. దావోస్‌లో అందుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నామని ఆయన వివరించారు.

lulu group

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద షాపింగ్
మాల్స్‌లో ఒక్కటైన లులూ గ్రూప్ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. లులూ సంస్థ పెట్టుబడులతో తెలంగాణ టూరిజం పెరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు. ప్రపంచ స్థాయి సంస్థలతోపాటు తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలోనే ఉందని.. అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

కాగా, హైదరాబాద్ నగరంలోని బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో మంత్రి కేటీఆర్, లులూ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫూడ్ ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్ అండ్ రిటైల్ రంగంలో తెలంగాణలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు కేటీఆర్ తో చర్చలు జరిపారు.

తెలంగాణ ప్రభుత్వం, లులూ మ‌ధ్య కుదిరిన ఒప్పందం తర్వాత.. రాబోయే రోజుల్లో తాము చేపట్టనున్న కార్యకలాపాల గురించి లూలు సంస్థ అధికారికంగా ప్రకటించింది. కాగా, గత దావోస్‌ పర్యటనలో మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో లులూ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదు‌ర్చుకుంది. లులూ సంస్థ హైప‌ర్ మార్కెట్లు, మ‌ల్టీ ప్లెక్స్‌ల నిర్మాణంలో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీగా పేరుగాంచింది. అబూదాబి కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని కొనసాగిస్తోంది లులూ సంస్థ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+