Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో బిగ్ బెలూన్ కలకలం: ఎక్కడ పడిందంటే..?

నాగర్ కర్నూల్ జిల్లా తర్నికల్ గ్రామం సమీపంలోని వ్యవసాయ పొలాల పక్కనే ఉన్న మామిడితోటలో పెద్ద బెలూన్ పడిపోయింది.

హైదరాబాద్: ఆకాశంలో బెలూన్ల సంచారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇటీవల చైనా బెలూన్ అమెరికా గగనతలంలోకి రావడంతో ఆ దేశం కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి పెద్ద బెలూన్ ఇప్పుడు తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది.

తర్నికల్ గ్రామం సమీపంలోని వ్యవసాయ పొలాల పక్కనే ఉన్న మామిడితోటలో ఈ బెలూన్ పడిపోయింది. దీంతో తర్నికల్ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో జనం భయాందోళనలకు గురయ్యారు. ఈ బెలూన్ ఎక్కడ్నుంచి వచ్చింది? ఆ బెలూన్లో ఏముందో అంటూ ఆందోళన చెందారు.

Machine attached balloon crashes on field in Nagarkurnool district, Telangana

అయితే, బెలూన్ కూలిపోయిన కాసేపటికే టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్ఆర్)కు చెందిన శాస్త్రవేత్తలు, అధికారులకు అక్కడికి చేరుకున్నారు. వాతావరణ మార్పులు, నక్షత్రాలపై పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ ఇదని.. దీంతో ఎలాంటి ముప్పు లేదని చెప్పడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.

శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పరిశోధనల కోసం ఈ భారీ బెలూన్‌ను ఆకాశంలోకి ఎగరవేసినట్లు అధికారులు తెలిపారు. ఆకాశంలో దాదాపు 32 కిలోమీటర్ల మేర పైకి పంపించినట్లు పేర్కొన్నారు.


ఈ సైన్స్ ఫిట్ బెలూన్‌ తో వాతావరణంలో మార్పులు, నక్షత్రాల కదలికలకు సంబంధించిన సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. అనంతరం ఈ బెలూన్‌ను కూల్చేశామని చెప్పారు. ఈ తరహా బెలూన్ల ప్రయోగం గతంలోనూ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటితో ఎలాంటి ప్రాణహాని ఉండదని పేర్కొన్నారు. జనసంచారం లేని ప్రదేశాల్లోనే వీటిని కూల్చినట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+