కెసిఆర్ సమక్షంలోనే మా పెళ్లి జరగాలి: ప్రత్యూష ప్రియుడు మద్దిలేటి

హైదరాబాద్/కర్నూలు: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సమక్షంలోనే తమ వివాహం జరగాలని ప్రత్యూష ప్రియుడు వెంకట మద్దిలేటి రెడ్డి ఆకాంక్షించాడు. తాజాగా అతడు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూషను ప్రేమించినట్టు తెలిపాడు.

తమ వివాహం సీఎం కేసీఆర్ సమక్షంలో జరగాలని కోరుకుంటున్నానని తెలిపాడు. ఈ విషయంపై గతంలో కూడా మద్దిలేటి స్పందించారు. ప్రత్యూషను ప్రేమించానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని మద్దిలేటి రెడ్డి చెప్పాడు. ఈ విషయాన్ని తమ ఇంట్లో కూడా చెప్పి తన తల్లిని ఒప్పించినట్లు తెలిపాడు.

Maddileti Reddy on his marriage with Prathyusha

కాగా, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన మద్దిలేటి రెడ్డిని ప్రేమించానని, అతన్నే వివాహం చేసుకుంటానని ప్రత్యూష బాలల హక్కుల సంఘం కార్యదర్శి అచ్యుతరావును కలిసి తెలిపింది.

అంతేగాక, తాను హాస్టల్‌లో ఉండలేనని, మద్దిలేటిరెడ్డిని పెళ్లి చేసుకున్నాకే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తానని ప్రత్యూష చెబుతోంది. హాస్టల్‌లో అన్నంలో సోడా వేస్తున్నారని, ఉడకని బియ్యంతో కూడిన అన్నం తినలేక పోతున్నానని తెలిపింది. ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతోందని తెలిపింది.

దీంతో ప్రత్యూష ఇప్పుడు మేజర్ అని.. ఆమె ఎవరిని వివాహం చేసుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉందని ఆయన చెప్పారు. కాగా, మద్దిలేటి రెడ్డికి ఆమె దూరంగా ఉండాలని కేసీఆర్ కోరుకున్నంటున్నట్లు మీడియాలో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+